ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. జనసేన పోటీ చేసిన చాలా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ను నమ్మి పవన్ పై అభిమానంతో అభిమానులు ఓట్లు వేసి కూటమిని గెలిపించుకోవడం జరిగింది. పడి లేచిన కెరటం పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
 
ఒకప్పుడు పవన్ కు రాజకీయాలు ఎందుకు ? సినిమాల్లోనే పవన్ కెరీర్ ను కొనసాగించి ఉంటే బాగుండేది? చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు పవన్ సక్సెస్ అవుతారా? అని విమర్శించిన వాళ్లు నేడు పవన్ సక్సెస్ ను చూసి సంతోషిస్తున్నారు. పవన్ ను ఎవడ్రా ఆపేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పవన్ కళ్యాణ్ కు మంత్రి పదవి దక్కడం ఖాయమని అదే సమయంలో సినిమాల్లో కూడా పవన్ సంచలనాలు సృష్టిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ పోరాటానికి దైవ బలం కూడా తోడై సంచలన విజయం దక్కిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏపీ ప్రజలు కూటమి విజయంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పొలిటికల్ గా కూడా అంతకంతకూ ఎదగడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
 
టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారణం కాగా ఆ పొత్తే ఈ ఎన్నికల్లో కూటమిని గెలిచింది. కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఏపీని అభివృద్ధి పథకంలో నడిపిస్తే మాత్రం 2029లో కూడా ఏపీ ఓటర్లు కూటమినే అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏపీలో కూటమి గెలవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్ కారణమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. సినిమా రంగంలో, పాలిటిక్స్ లో సక్సెస్ అయిన అతికొద్ది మందిలో పవన్ కళ్యాణ్ ఒకరిగా నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: