ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో టిఆర్ఎస్ పార్టీ అధినేత అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఆ తర్వాత కాస్త ముందస్తుగానే ఎన్నికలకు టిఆర్ఎస్ పార్టీ దిగింది. దానితో 2018 వ సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.

ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తన హవాను పూర్తిగా చూపించింది. దానితో భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని రెండవ సారి తెలంగాణ రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది. ఇక 2023 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మూడవ సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో టిఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది.

పార్టీ కి చాలా తక్కువ అసెంబ్లీ స్థానాలు రావడం , కాంగ్రెస్ కి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు రావడంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక అసెంబ్లీ స్థానాలలో భారీ దెబ్బ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చాయి. ఈ ఎలక్షన్ల కోసం కెసిఆర్ రంగం లోకి దిగి బస్సు యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించాడు. ఈ యాత్రలకు జనాలు తండోపతండాలుగా విచ్చేశారు.

దానితో కనీసంలో కనీసం బీఆర్ఎస్ పార్టీ వారు నాలుగైదు పార్లమెంట్ స్థానాలైనా దక్కించుకుంటారు అని ఎంతో మంది ప్రజలు విశ్వసించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. దానితో బీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పార్టీ మీటింగ్ లకి ఎంతో మంది వచ్చారు. వారంతా ఓటు వేయలేదా..? మరి ఎందుకు మన పార్టీకి ఓటు వెయ్యట్లేదు..? తప్పు ఎక్కడ జరుగుతుంది..? అనే దానిపై చాలా లోతుగా ఈ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs