అయితే జగన్ సన్నిహితులు మాత్రం జగన్ ఓటమికి అవినాష్ ఇరగవరపు కారణమని భావిస్తున్నారు. జగన్ పక్కన ఉంటూనే అవినాష్ పార్టీని మాత్రం ముంచేశారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో అవినాష్ ఇరగవరపు డోనాల్డ్ ట్రంప్ దగ్గర పని చేశారు. ట్రంప్ దగ్గర పొలిటికల్ సలహాదారుడిగా ఆయన పని చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జగన్ అంతర్గత రాజకీయ సలహాదారుడిగా అవినాష్ పని చేశారని భోగట్టా.
అయితే అవినాష్ ఇరగవరపు ఇచ్చిన సర్వే ఫలితాలను నమ్మి జగన్ మోసపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ అవినాష్ ను సర్వేల పరంగా ఎంతో నమ్మారని కానీ అవినాష్ ఇచ్చిన నివేదికలు మాత్రం వాస్తవాలకు ఏ మాత్రం దగ్గరగా లేవని తెలుస్తోంది. ప్రతి సర్వేలో జగన్ కు తిరుగులేదని అవినాష్ వెల్లడించారని పొలిటికల్ వర్గాలలో వినిపిస్తోంది.
2013 సంవత్సరం నుంచి అవినాష్ వైసీపీకి వ్యూహ రచన చేయడంలో కీలక పాత్ర పోషించారు. అవినాష్ వల్లే వైసీపీ ఓడిపోయిందని చెప్పలేం కానీ వైసీపీ ఓడిపోవడంలో ఇతని పాత్ర కూడా ఎక్కువగానే ఉందని మాత్రం కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాజమండ్రికి చెందిన అవినాష్ ఇరగవరపు ఐఐఎం లక్నోలో ఎంబీఏ చదివారు. వైసీపీతో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలకు సైతం ఆయన వ్యూహకర్తగా పని చేశారని తెలుస్తోంది. జగన్ పక్కన ఉంటూనే అవినాష్ ఇరగవరపు జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో పూర్తిస్థాయిలో ఫెయిల్ అయ్యారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.