ఇకపోతే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కేతిరెడ్డి వెంకట్రెడ్డి.. కూటమి తరుపున పోటీ చేసిన బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ కేవలం 3000 ఓట్ల మెజారిటీతో కేతిరెడ్డి పై విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ విషయం తెలిసి యావత్తు రాష్ట్రమే ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఉదయం లేచిందే మొదలు నిత్యం ప్రజలతోనే తన జీవితాన్ని గడిపిన కేతిరెడ్డి ఇలా ఓడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడేదో మేనిప్లేషన్ జరిగిందనే వార్తలు వినిపిస్తున్నా సరైన ఆధారాలు లేక ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు.
ఈ విషయంలోనే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన కేతిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఒక వీడియోని షేర్ చేశారు.. తనను కలవడానికి ఎవరూ రావద్దు అంటూ స్పష్టం చేశారు.. కేతిరెడ్డి మాట్లాడుతూ.. నేను ,నా భార్య, నా తమ్ముడు ఉదయం లేచింది మొదలు ప్రజలతోనే ఉన్నాము.. ఐదు సంవత్సరాల పరిపాలనలో వారికి ఏ రోజు ఏ నష్టం కలగకుండా వారి వెంటే ఉన్నాము.. కానీ ప్రజలు ఇలాంటి తీర్పునిస్తారని మేము ఊహించలేదు.. అందుకే ఈ బాధ నుంచి కోలుకోవడానికి నాకు చాలా సమయం పడుతుంది కాబట్టి ఎవరు కూడా దయచేసి నన్ను కలవడానికి రావద్దు అంటూ ఒక వీడియో షేర్ చేశారు కేతిరెడ్డి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.