అలాగే ఈవీఎం ధ్వంసం మరో మూడు కేసులు పిన్నెల్లి పైన పల్నాడు స్టేషన్లో నమోదు అయ్యాయట.ఈ కేసుల్లో గతంలో మద్యం తర ముందస్తు బెయిల్ పొందారు. అయితే ఇప్పుడు న్యాయస్థానం మరింత పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే గురువారం వరకు మధ్యంతర బెయిలు ను పొడిగిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. వచ్చే గురువారం వరకు మధ్యంతర భైలును పొడిగించాలని పిన్నెల్లి న్యాయవాది సైతం కోరడంతో ఇదంతా కేవలం కుట్రపూరితంగానే తన మీద కేసులు పెట్టారని కూడా పిన్నెల్లి న్యాయవాది తెలియజేశారు.
ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ ఉన్న కేసుల్లో 41 A నోటీసు ఇవ్వచ్చని సుప్రీంకోర్టు కూడా ఉత్తర్వులను తెలియజేసింది. ఎన్నికల సంఘం ఈవీఎం ధ్వంసం కేసులో విచారణ చేయాలని అలా కాకుండా నేరుగా అరెస్టు చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఇది చట్ట విరుద్ధం అంటూ కూడా ఆయనకు కోర్టుకు వెల్లడించారు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి ప్రతిష్ట దెబ్బ తినడానికి ఇతర నేతలు సైతం కుట్ర పడి ఇలా చేశారని అంతేకాకుండా అత్యాయత్నం కేసులో కూడా తనని అనవసరంగా ఇరికించి పోలీసు రికార్డులు తారుమారు చేశారని కూడా తెలిపారు. 13వ తేదీన ఘటన జరిగితే 23వ తేదీన కేసు నమోదు చేసి 22న కోట్లు తప్పుదారి పట్టించారు అంటూ కూడా తెలిపారు.