టిడిపి పార్టీ అధికారంలోకి రాగానే అప్పుడే వైసిపి నేతల మీద దాడులు మొదలుపెట్టారు. ఇప్పుడు తాజాగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఇంటి పైన కొంతమంది యువకులు రాళ్లు విసిరి మరి బెదిరిస్తున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పెరిగిపోయింది. వైసిపి అధికారంలో ఉండగా గన్నవరం నియోజవర్గంలో చాలా అరాచకాలకు పాల్పడ్డారని వార్తలు వినిపిస్తున్న సమయంలో ప్రశ్నిస్తే దాడులు చేశారని ఇప్పటికైనా వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పాలని కొంతమంది యువకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు యువకులను అడ్డుకొని మరి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేశారు.



ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికి ఆ యువకులు మళ్ళీ వల్లభనేని వంశీ ఇంటి వద్దకు చేరుకొని వల్లభనేని కి వార్నింగ్ ఇస్తూ దమ్ముంటే బయటకు రావాలని నినాదాలు కూడా చేస్తూ ఉన్నారు. దీంతో మరొకసారి ఆ ప్రాంతంలో ఉద్రిక్తత మొదలైంది. ఇప్పుడు అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. గత ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వల్లభనేని వంశి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే టిడిపి పార్టీ ఓడిపోవడంతో వైసిపి పార్టీకి మద్దతు తెలిపారు.



ఆ తర్వాత గన్నవరం నియోజవర్గంలో వల్లభనేని వంశీతోపాటు ఆయన అనుచరులు కూడా వైసిపి పార్టీకి సపోర్టు చేశారు. వల్లభనేని వంశీ కారుల మీద దాడి చేయడమే కాకుండా ఇంటి చుట్టూ పరిసరాలలో కూడా గోడలు పగలగొట్టి గేటు పీకి వేసి లోపలికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఇలాంటి సంఘటనల మీద పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. అయితే అక్కడ ఉండే సెక్యూరిటీ వల్ల బనేని వంశీ ఇక్కడ లేరని తెలియజేస్తున్నారట. వంశి ఇంటి వద్ద యార్లగడ్డ అనుచరులు సైతం నానా హంగామా చేస్తున్నారు. అయితే మార్లగడ్డ మాత్రం  కార్యకర్తల్ని పోలీసులే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే టిడిపి నేత తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: