ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. గత ఐదు సంవత్సరాలలో అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచిన జగన్మోహన్ రెడ్డిని కాదని... తెలుగుదేశం కూటమికి ఛాన్స్ ఇచ్చారు ఏపీ ప్రజలు. దీంతో ఆంధ్ర ప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. 164 స్థానాలు సంపాదించుకున్న తెలుగుదేశం కూటమి... ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది.

 తెలుగుదేశం కూటమి 164 స్థానాలు గెలుచుకోగా...  కేవలం వైసీపీకి 11 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. అలాగే... నాలుగు ఎంపీ స్థానాలు వైసిపి పార్టీ కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలు దక్కించుకున్న వైసిపి పార్టీ... రెండు నుంచి ఐదు వేల ఓట్ల తేడాతో  దాదాపు 88 స్థానాలను ఈసారి కోల్పోయిందట. ఈ 88 స్థానాలలో తక్కువ మెజారిటీతోనే...వైసిపి పార్టీ ఓడిపోవడం జరిగింది.

 ఇది ఇలా ఉండగా... అధికారం ఎక్కడ ఉంటే అక్కడే నేతలు ఉండటం ఇప్పుడు అలవాటైపోయింది. ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతుందని తెలుస్తోంది. ఎందుకంటే వైసిపి పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు  బిజెపి పార్టీ టచ్లోకి వెళ్లారట. ఏపీలో వైసిపి పార్టీ ఓడిపోవడంతో... ఏకంగా ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలు... బిజెపి నేతలతో చర్చలు నిర్వహిస్తున్నారట. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి బిజెపి నేతలతో చర్చలు జరిపారా ? లేక బిజెపి పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలతో... చర్చలు జరుపుతోందా ? అనేది క్లారిటీ లేదు.

 మొత్తానికి ఏదో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అయితే ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత... వైసిపి పార్టీ ఎమ్మెల్యేలు.. పార్టీ మారే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత...బిజెపి ఒక్కటే కాకుండా.... జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ వల్ల కూడా చేరి నేతలు ఉన్నారట. అలా 9 మంది బయటకు వెళ్లే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడే రాజకీయ నేతలు ఉంటున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: