ఇండియాలో... ఎన్డీఏ కూటమి అవలీలగా అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ జూన్ 4వ తేదీన
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో... మోడీ ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. అనూహ్యంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కూటమి  ఎక్కువ సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 99 స్థానాలు దక్కించుకుంది. ఇక ఇండియా కూటమి ఓవరాల్ గా.. 234 సీట్లను సాధించగలిగింది.

 
అయితే ఇండియా కూటమి కంటే... ఎన్డీఏ కూటమి ఎక్కువ సీట్లు  గెలుచుకున్న నేపథ్యంలో... ప్రభుత్వం కేంద్రంలో ఏర్పాటు చేయబోతుంది. చంద్రబాబు, నితీష్ కుమార్ చక్రం తిప్పడంతో... కేంద్రంలో మోడీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే... కేంద్రంలో బిజెపి సర్కార్ మరోసారి రాకుండా... ఉండేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల వ్యూహాలను అమలుపరుస్తోంది.


234 స్థానాలు దక్కిన నేపథ్యంలో... మరో 38 సీట్లు  ఇండియా కూటమికి వస్తే... రాహుల్ గాంధీ ప్రధాని కావడం గ్యారెంటీ. దీంతో...  ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలకు కూడా బంపర్ ఆఫర్లు ఇస్తోంది ఈ కాంగ్రెస్ కూటమి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడుకు బంపర్ ఆఫర్ ఇచ్చిందట ఇండియన్ కూటమి. అలాగే నితీష్ కుమార్ కు కూడా ఆఫర్ ఇచ్చారట. డిప్యూటీ ప్రధాని పోస్ట్ కూడా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారట.


ఇక ఇటు... ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమికి సపోర్ట్ చేయని పార్టీలు చాలానే ఉన్నాయి. ఆ సీట్లు మొత్తం 17 స్థానాలు. అందులో వైసిపి పార్టీ నాలుగు ఎంపీ స్థానాలను కలిగి ఉంది.  దీంతో స్వయంగా జగన్మోహన్ రెడ్డితో సోనియా గాంధీ ఫోన్ చేసి మాట్లాడారట. ఇండియా కూటమీ కి సపోర్ట్ చేయాలని కోరారట. జగన్మోహన్ రెడ్డి తోనే కాకుండా... ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఓవైసీ, అటు నవీన్ పట్నాయక్ లాంటి నేతలతో కూడా టచ్ లో ఉందట కాంగ్రెస్. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: