ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వాన్ని... మట్టి కల్పించిన తెలుగుదేశం కూటమి.. ఈనెల 12వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఏపీలో ఏర్పాటు చేయబోతుంది. 164 స్థానాలు దక్కించుకున్న తెలుగుదేశం కూటమి.. వైసిపిని 11 స్థానాలకు పరిమితం చేసింది. అయితే ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి రావడమే కాకుండా... కేంద్రంలోనూ చక్రం తిప్పబోతోంది.

.

 ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కలిగి ఉన్న పార్టీగా అవతరించింది. దీంతో అందరి దృష్టి నారా చంద్రబాబు పైన పడింది. గతంలో...  చక్రం తిప్పుతా అని చంద్రబాబు చాలాసార్లు అంటే ఎవరు నమ్మలేకపోయారు.  కానీ ఈ ఎన్నికల్లో దేశ రాజకీయాలను చుట్టేస్తున్నారు చంద్రబాబు. ఇదే సమయంలో.. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ షేర్లు కూడా విపరీతంగా పెరిగాయి.


 ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు మద్దతు పలకడంతో... షేర్ మార్కెట్లకు కూడా విపరీతంగా లాభాలను గడిస్తున్నాయి. ఇక చంద్రబాబు స్థాపించిన  హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ షేర్లు...  గత నాలుగు రోజులుగా భారీగా అని లాభాలు పొందుతున్నాయి. 1992లో స్థాపించిన హెరిటేజ్ డైరీ కంపెనీ... దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలకు  విస్తరించారు చంద్రబాబు.


 ఇందులో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ ది 24.37% వాటా ఉంది. గురువారం ట్రేడింగ్ సమయంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 10 శాతం పెరిగి... ఒక్కో షేరు 600 రూపాయలు దాటిపోయింది. శుక్రవారం మరింత పెరిగిందట. రికార్డు స్థాయిలో 55%... శుక్రవారం రోజున హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు జోరుగా పెరిగినట్లు చెబుతున్నారు నిపుణులు. గత శుక్రవారం రోజున హెరిటేజ్ షేర్ విలువ 424 ఉంటే... ఈ శుక్రవారం కు 661 కి చేరింది. దీంతో ఐదు రోజుల్లో నారా భువనేశ్వరి సంపాదన 579 కోట్లకు చేరిందట. మరో నాలుగు రోజుల్లో ఆమె సంపాదన ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: