రామోజీరావు ధనవంతులుగా ఎదగడం స్ఫూర్తిదాయకమైన కథ అని చెప్పాలి.. 1936 నవంబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు ..అంతేకాదు తన సంస్థల ద్వారా ఎంతో మంది ప్రజలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించి పరోక్షంగా వారికి ఆర్థిక అండగా నిలిచారు.. ఇకపోతే ప్రపంచంలోనే అతిపెద్ద థీమ్ పార్క్ మరియు ఫిలిం స్టూడియో రామోజీ ఫిలిం సిటీని స్థాపించిన ఘనత కూడా ఈయనకే సొంతం..
మార్గదర్శి , రమాదేవి పబ్లిక్ స్కూల్, ఈటీవీ నెట్వర్క్, ప్రియా ఫుడ్స్, కళాంజలి , ఉషా కిరణ్ మూవీస్ , డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ రామోజీరావుకు చెందిన సంస్థలు. ఇక ఇవే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకంగా ఉన్న టిడిపి పార్టీకి మార్గదర్శి అని చెప్పవచ్చు.. అంతేకాదు టిడిపి పార్టీతో పాటు ప్రభుత్వాలను కూడా సక్రమంగా పనిచేసేలా తీర్చిదిద్దిన అక్షర యోధుడు అని చెప్పవచ్చు.. ఈనాడు దినపత్రిక ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు అని తెలిస్తే.. ఆ విషయాలను ఎండగడుతూ.. తన అక్షర రూపంలో ఈనాడు దినపత్రిక ద్వారా ప్రజలకు చేరవేసి తద్వారా ప్రభుత్వాలనే మార్చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పవచ్చు. ఈనాడు దినపత్రిక తెలుగు నాట ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ పత్రిక ద్వారా ప్రపంచ నలమూలలా ఉన్న వార్తలను ప్రజలకు చేరవేసి ప్రభుత్వాలను కూడా సరైన మార్గంలో నడిచేలా చేశారు.