ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత అయిన చెరుకూరి రామోజీరావు (87) తీవ్ర అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు నానక్ రామ్ గూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్యం విషమించడంతో.. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవలే ఆయన గుండెకు వైద్యులు స్టంట్స్ కూడా వేశారు. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన.. చికిత్స పొందుతూ మరణించారు. రామోజీరావు పార్థీవదేహాన్ని ఫిల్మ్ సిటీలోని ఆయన నివాసానికి తరలించారు. రామోజీరావు మృతిపట్ల సినీ ప్రముఖులు మరియు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. 1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో ఆయన జన్మించారు. గుడివాడలో బీఎస్సీ డిగ్రీ అక్కడే పూర్తి చేశారు. 

ఈనాడు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, మరియు ప్రచురణ కర్త, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి తదితర వ్యాపార సంస్థల అధినేతగా రామోజీ రావు వున్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శం. ఆయన ఎన్నో సినిమాలని ప్రొడ్యూస్ చేసారు. ఎందరో నటినటులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు..తాజాగా జూనియర్ ఎన్టీఆర్ రామోజీరావు మరణ వార్త విని ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఎమోషనల్ ట్వీట్ చేసారు.రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ట్వీట్ చేసారు..రామోజీరావు వంటి వ్యక్తులు నూటికో కోటికో ఒకరు వుంటారు.ఆయన లేని లోటు ఎప్పటికి పూడ్చలేనిది..నిన్ను చూడాలని సినిమాతో నన్ను తెలుగు తెరకు పరిచయం చేసిన ఆ వ్యక్తిని ఎప్పటికి మర్చిపోలేను..ఆ మహనీయుడు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను..అని ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: