రామోజీరావు... ఈ పేరు తెలియని వారు ఉండరు. తెల్లటి చొక్కా అలాగే తెల్లటి పాయింట్  వేసుకొని నిలువెత్తు... ఓ వీరుడిలా కనిపిస్తాడు రామోజీరావు. అలాంటి.. వీరుడు ఇవాళ నేలకొరిగాడు. ఉదయం ఐదు గంటల సమయంలో గుండె సమస్య కారణంగా రామోజీరావు మరణించారు. దీంతో రామోజీరావు కు సంతాపం తెలుపుతున్నారు ప్రముఖులు. అయితే సాధారణ గ్రామస్తుడి నుంచి... ప్రపంచ స్థాయికి ఎదిగారు రామోజీరావు.


 మీడియా సంస్థల అధినేత గానే కాకుండా, ఒక వ్యాపార వేత్తగా, సినిమా ప్రొడక్షన్ రంగంలో, అలాగే రాజకీయా సలహాదారులుగా  ఇలా ఎన్నో రంగాల్లో రాణించారు రామోజీరావు. రామోజీ ఫిలిం సిటీ లాంటి... కట్టడాన్ని నిర్మించి ప్రపంచ స్థాయికి ఎదిగారు. రూపర్ట్ మార్దోక్ గా పేరు గాంచిన రామోజీరావు... 1936 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

 

గుడివాడలో విద్యాభ్యాసం చేసిన రామోజీరావు... మొట్టమొదటిగా రైతుల కోసం ఓ పత్రికను తీసుకువచ్చారు. ఆ తర్వాత ఆ పత్రిక సినిమా నిర్మాణం వైపు తీసుకువెళ్లింది. 1983 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించారు రామోజీరావు. తెలుగులోనే కాకుండా, హిందీ మలయాళం కన్నడ మరాఠీ బెంగాలీ లా 80 కి పైగా విభిన్న భాషలలో సినిమాలు తీశారు. అలాంటి రామోజీరావు... ఈనాడు పత్రిక అలాగే ఈనాడు ఛానల్ ను తీసుకువచ్చే సంచలనం సృష్టించారు.



 ఇక నమ్మకం అనేది రామోజీరావు లైఫ్ లో ఒక గొప్ప పదం. ఒక మనిషిని నమ్మాడు అంటే... అతని కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధపడతారు రామోజీరావు. తన దగ్గర నమ్మకంతో పనిచేసిన వారికి... అన్ని విధాలా ఆదుకుంటారు. అలాగే... నమ్మకద్రోహం చేస్తే మాత్రం అస్సలు ఒప్పుకోరు. ఎంతో నమ్మకస్తులైన వారిని మాత్రమే తన దగ్గర... పెట్టుకుంటారు రామోజీరావు. మంది వ్యక్తులను తన దగ్గర నమ్మకంగా పెట్టుకొని ఉపాధి కల్పించారు. దానికి తగ్గట్టుగానే రామోజీరావుకు ఎలాంటి వెన్నుపోటు పొడవకుండా... ఉద్యోగులు చాలామంది పనిచేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: