అక్షర యోధుడు రామోజీ రావు ఆకస్మిక మరణం తెలుగు సినీ ప్రపంచానికి తీరని శోకం. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలు ఎనలేనివి. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి లేటెస్ట్ టెక్నాలజీ వరకు అన్ని మార్పులను చూసింది ఉషాకిరణ్ మూవీస్. 1983లో రామోజీ రావు స్థాపించిన ఈ ఉషా కిరణ్ మూవీస్ కి ఎంతో చరిత్ర ఉంది. అలాగే ఎంతోమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. ఈతరంలో చాలామందికి తెలియక పోవచ్చు, కానీ అప్పట్లో వాటిలో చాలావరకు వీరి ద్వారా వచ్చిన చిత్రాలు బ్లాక్‌బస్టర్‌ అయ్యాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ మూవీతో టాలీవుడ్‌లో ఉషా కిరణ్ మూవీస్ ప్రయాణం మొదలుపెట్టి అనేకానేక సినిమాలు, సీరియళ్లు నిర్మించింది.

ఉషా కిరణ్ మూవీస్ లో ‘మయూరి’, ‘ప్రతిఘటన’ లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్ లాంటి నటులకు ఓ రకంగా జీవితన్నించ్చింది వీరే. ‘మౌన పోరాటం’ మూవీ ఎటువంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఆ మూవీకి లభించిన ఆధరణ మరే మూవీకి రాలేదు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా మలయాళం, హిందీ భాషల్లో కూడా ఉషా కిరణ్ మూవీస్.. సినిమాలను నిర్మించడం మొదలుపెట్టింది. తెలుగులో తెరకెక్కించిన సినిమాలనే ఇతర భాషల్లో రీమేక్ చేసి అక్కడ కూడా సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు. ‘నువ్వే కావాలి’, ‘చిత్రం’, ‘ఆనందం’ వంటి చిత్రాలను ఇప్పటికీ రిపీట్‌లో చూసే ప్రేక్షకులు మనలో ఎంతోమంది ఉన్నారు అంటే అతిశయోక్తి కాదేమో.

ఇక ‘చిత్రం’ లాంటి బోల్డ్ సినిమాను నిర్మించి అప్పతోనే పెద్ద సంచలనం సృష్టించారు మన రామోజీ రావు. ఇక 2003లో అయితే ఒక హిందీ, 2 కన్నడ, 2 తెలుగు, 1 తమిళ చిత్రాలను బ్యాక్ టు బ్యాక్ నిర్మించి రికార్డ్ సాధించారు. ఆ తర్వాత ఎన్నో కొత్త నిర్మాణ సంస్థలు టాలీవుడ్‌లో పుట్టుకొచ్చాయి. దీంతో పోటీ పెరిగి ఉషా కిరణ్ మూవీస్.. సినిమాలను నిర్మించడంలో వేగం తగ్గించింది. చివరిగా 2015లో రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్ చేసిన ‘దాగుడుమూత దండాకోర్’.. ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణంలో వచ్చిన చివరి చిత్రంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: