మీడియా మొఘ‌ల్‌గానే కాకుండా.. సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌నకంటూ వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన రామోజీ రావు.... భౌతికంగా అస్త‌మించారు. కానీ, ఆయ‌న ఆత్మ‌.. ఈనాడు, రామోజీ ఫిల్మ్ సిటీల రూపంలో చిర‌స్థాయిగా తెలుగు నేల‌పై మ‌రికొన్ని ద‌శాబ్దాల పాటు నిలిచిపోతాయి. ఈనాడును ఎలా అయితే.. ప్రేమించారో.. ఆయ‌న జీవితంగా ఫిల్మ్ సిటీని అంత‌కు మించి ప్రేమించారు. అది 1980-90ల మ‌ధ్య ప‌రిస్థితి. ఏ చిన్న షూటింగ్ చేయాల‌న్నా.. ఎక్క‌డెక్క‌డ‌కో వెళ్లాల్సి వ‌చ్చేది.


ఉదాహ‌ర‌ణ‌కు ఒక పాట కోసం.. వేరే ప్రాంతాల‌కు.. ఒక సీన్ సీన్ కోసం.. పొరుగు రాష్ట్రాల‌కు నిర్మాత‌లు ప‌రుగులు పెట్టాల్సి వ‌చ్చేది. ఒక నిర్మాత‌కు ఇవ‌న్నీ.. త‌డిసిమోపెడు భారం. దీనికితోడు ఇంత పెట్టుబ‌డి పెట్టినా.. స‌ద‌రు సినిమాలు ఆడ‌క‌పోతే.. నిర్మాత న‌ష్ట‌పోవ‌డం ఖాయం. ఒక స‌హ‌జ నిర్మాత‌గా రామోజీరావు ను ఇవ‌న్నీ.. క‌దిలించాయి. నిర్మాత క‌ష్టాలు ఎలా ఉంటాయో.. తెలిసిన వ్య‌క్తిగా.. వీటిని ఆయ‌న ఔపోస‌న ప‌ట్టారు. నిర్మాత క‌ష్టాలు త‌గ్గించాల‌న్న దృఢ సంక‌ల్పంతో మ‌న‌కంటూ.. ఒక ఫిల్మ్‌సిటీ ఉండాల‌ని క‌ల‌లు గ‌న్నారు.


ఈ క్ర‌మంలోనే ఆయ‌న 1982-86 మ‌ధ్య‌నాలుగు సంవ‌త్స‌రాల పాటు.. ప్ర‌పంచంలోని అతి పెద్ద ఫిల్మ్ సిటీల‌ను సంద‌ర్శించారు. వాటిలాగానే.. ఏపీలోనూ ఒక‌చిత్ర న‌గ‌రిని రూపొందించాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. కానీ, ఎలా?  సాధ్య‌మేనా? అని అనుకున్న‌ప్పుడు.. ఎందుకు సాధ్యం కాద‌నే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌చ్చింది. అక్క‌డే రామోజీ ఫిల్మ్ సిటీకి అంకురార్ప‌ణ జ‌రిగింది. ఏకంగా.. నాలుగు గ్రామాలు.. 2000ల‌కు ఎక‌రాల స్థ‌లం త‌నకు కావాలంటూ.. ప్ర‌భుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.


అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వ స‌హ‌కారంతో హైదరాబాద్ శివారులో స్థ‌లం విడ‌త‌ల వారీగా అప్ప‌గించారు. అక్క‌డ రూపుదిద్దుకున్న‌దే రామోజీఫిల్మ్ సిటీ. ఇదేమీ తేలిక‌గా అయిపోలేదు. కోట్ల‌కు కోట్ల సొమ్ము.. లారీల్లో త‌ర‌లించిన‌ట్టు త‌రలించారు. కానీ, మ‌రోవైపు..కుటుంబం వారించింది. ఇంత సొమ్మును ఖ‌ర్చు పెడితే.. ఎలా?  అది హిట్ కాక‌పోతే.. ఏం జ‌రుగుతుంద‌నే వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. అయినా.. రామోజీ వెనుక‌డుగు వేయ‌లేదు.


అనేక మంది స‌హకారం తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీని దేశంలోనే కాదు.. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ 1గా తీర్చి దిద్దారు. ఈ క్ర‌మంలో 2004లో ప్ర‌భుత్వం మారిపోయింది. దీంతో న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు కూడా.. చుట్టుకున్నాయి. అయినా.. వాటిని ఎదిరించి ముందుకు సాగారు. రామోజీ ఫిల్మ్ సిటీని సాకారం చేసుకున్నారు. అన‌ధికార అంచ‌నాప్ర‌కారం.. రోజుకు 100 కోట్ల రూపాయ‌ల వ్యాపారం.. ఇక్క‌డే జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: