ఇలాంటి అరుదైన ఘనత దక్కించుకున్న బాలయ్య ఈసారి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోకి తీసుకొని కీలకమైన పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నారా లోకేష్ మంత్రిగా ఉండడం వల్ల బాలయ్యకు ఎంతవరకు అవకాశం లభిస్తుందో అంటూ బాలయ్య అభిమానులు అనుమానం గానే తెలియజేస్తున్నారు. బాలయ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే కావడం చేత కచ్చితంగా పదవికి అర్హుడే అన్నట్టుగా అభిమానులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఈసారి చంద్రబాబు నాయుడుకి పూర్తిగా మెజారిటీ రావడంతో కేంద్రంలో కూడా చాలా కీలకంగా మారనున్నారు.. అందుకే బాలయ్య అభిమానులు కూడా ఈసారి తమ హీరోకి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచనలో ఉన్నారు. మరో రెండు రోజులలో అసలు విషయం ఏంటన్నది క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ బాలయ్య కు మంత్రి పదవి వస్తే డైరెక్టర్ బాబి సినిమా పూర్తిగా చేసిన తర్వాత మరే ఎ సినిమాలో కూడా కనిపించరని.. బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరో కొద్ది రోజుల వరకు ఆడాల్సిందే.. హిందూపురం నియోజకవర్గం బాలయ్యకు కంచుకోటగా మారిపోయింది. అక్కడ బాలయ్య చేసిన మంచి పనుల తనని గెలిపిస్తున్నాయని కూడా చెప్పవచ్చు.