ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈ క్రమంలో రామోజీ రావు గురించి సుదీర్ఘంగా లేఖ రాయడం జరిగింది. రామోజీ రావు గారు మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలో ఓ ఒరవడిని తీసుకువచ్చారు... వారికి ఓం శాంతి.. అని మోదీజీ సోషల్ మీడియాలో సంతాపం ప్రకటించారు. టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి మీడియా వేదికగా మాట్లాడుతూ... దేశానికి ఎంతో సేవ చేసిన రామోజీరావు గారికి ఖచ్చితంగా 'భారత రత్న' ప్రకటించి తీరాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు. ఎవ్వరికీ తలవొంచని మేరు పర్వతం శ్రీ రామోజీరావు.. అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడగా, తనను సినీపరిశ్రమకు పరిచయం చేసింది మీడియా దిగ్గజం శ్రీ రామోజీరావు అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్మరించుకున్నారు.
దాదాపు రాజకీయ, సినిమా, వ్యాపార ప్రముఖులు ప్రస్తుతం శ్రీ రామోజీ రావు గారి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో అనేకమంది చాలా ఎమోషనల్ అవుతున్నారు. విక్టరీ వెంకటేష్ తాజాగా స్పందిస్తూ... రామోజీరావుగారు ఈ తెలుగు జాతికి చేసిన సేవలు ఎనలేనివి. తెలుగు సాహిత్యాన్ని బతికించడం కోసం ఆయన అహర్నిశలు పాటుపడ్డారు... అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు.