ఇప్పటికే ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను అభినందిస్తూ ఒక ట్విట్ ను కూడా షేర్ చేశారు అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్విట్ చేశారు.హింసాత్మకమైన ఘటనలకు తావులేనని నిన్నటి రోజున మీరు ఇచ్చిన సందేశం చాలా ప్రశంసనీయమని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యాలను భిన్నమైన వాతావరణం నెలకొంది అంటూ ఆయన వెల్లడించారు. అయితే కొంతమంది జనసేన కార్యకర్తలు నేతలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని వీడి జనసేన లోకి చేరబోతున్నారనే విధంగా ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో బాలినేని ఒంగోలు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయగా.. ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు రాజకీయాలలో బాలినేని చేసిన ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది .2019లో 151 యొక్క స్థానాలు సాధించిన వైసీపీ ఈసారి 11 సీట్లకే పడిపోవడంతో చాలామంది అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాలుగు పార్లమెంటు స్థానాలకే పరిమితమైంది వైసిపి పార్టీ కొంతమంది టిడిపి నేతలు అధినేతలు సైతం ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహంతోనే వైసిపి ఘోరంగా ఓడిపోయింది అంటే తెలియజేశారు. నిన్నటి రోజున వైసీపీ నేతలతో వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది. మరి ఎలాంటి నిర్ణయాలతో ప్రజల ముందుకు వస్తారో చూడాలి.