ఈరోజుల్లో సోషల్ మీడియా అనేది ప్రతి విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి, ఒక పొలిటిషన్‌ను ప్రమోట్ చేయడానికి, లేదా భ్రష్టు పట్టించడానికి సోషల్ మీడియా అనేది కీలకంగా మారింది. రాజకీయాలు, వెటకారాలు, ట్రోలింగ్ వీటన్నిటికీ కూడా ఇది ఒక వేదికగా నిలుస్తోంది. సోషల్ మీడియా చాలామందిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఏపీ విషయానికొస్తే.. టీడీపీ, వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. వైసీపీ అధినేత జగన్‌ను టీడీపీ వాళ్లు ఎగతాళి చేస్తుంటే.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను వైసీపీ వాళ్లు ఆడుకుంటూ ఉంటారు.

గడిచిన 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ సమయంలో ఈ పార్టీ సోషల్ మీడియా యూజర్లు టీడీపీ వాళ్లని ఒక ఆట ఆడుకున్నారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, పావలా కళ్యాణ్‌ అని, చంద్రబాబు కాళ్లు వస్తే వాడు అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఇక చంద్రబాబును కూడా తమదైన శైలిలో ఏకిపారేశారు. మామూలుగా చంద్రబాబు లైట్లు, ఫోన్లు, కంప్యూటర్లు కనిపెట్టింది తానే అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఆ వీడియోలను షేర్ చేస్తూ చంద్రబాబు నార్సిసిజం బాగా పెరిగిపోయిందంటూ విమర్శించేవారు.

కానీ ఇప్పుడు వైసీపీ వాళ్లు సోషల్ మీడియాలో పూర్తిగా సైలెంట్ అయిపోయారు. టీడీపీ వాళ్లు బాగా యాక్టివ్ అయ్యారు. వీళ్లు వైసీపీని బాగా టార్గెట్ చేస్తున్నారు, ఇప్పుడు వారి ట్రోలింగ్ పీక్ స్టేజ్‌కి చేరుకుంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దాంతో వైసీపీ వాళ్లు 23 నంబర్‌ను టీడీపీ పార్టీలో జరిగే రకరకాల సంఘటనలతో లింక్ చేస్తూ వెటకారాలు చేసేవారు. టీడీపీ వాళ్లు వాటన్నిటినీ భరించారు. చివరికి టీడీపీ తమ్ముళ్లకు వైసీపీ వాళ్లను ఎగతాళి చేసే సమయం వచ్చింది. ఎందుకంటే వైసీపీ కేవలం 11 సీట్లే గెలుచుకుంది. 23 గెలుచుకుంటేనే చాలా చులకనగా చూశారు వైసీపీ వాళ్లు, కానీ ఇప్పుడు వాళ్లే అందులో సగం సీట్లు కూడా గెలుచుకోలేకపోయారు. దాంతో వీరి తల తీసేసినంత పని అయింది. ఈ ఘోరమైన పరాజయాన్ని గుర్తుచేస్తూ కూటమి మద్దతుదారులు వైసీపీని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. వారు ఆ నంబర్‌ను ఆడుదాం ఆంధ్రతో లింక్ చేస్తూ వెటకారాలు చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్రాలో మిగిలింది 11మందే వైసీపీ గెలిచింది 11 మందే అంటూ ఆట పట్టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: