టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసేందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014 లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.ఈప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి,రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని కావున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే విస్తృత మైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.శనివారం రాత్రి 09:46 గంటలకు సోషల్ మీడియా వేదిక గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం పై సీఎంఓ ఆఫీస్ నుండి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు జూన్-12న 09:27 నిమిషాలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పోస్ట్ లో స్పష్టం చేసింది. ఈ ప్రమాణానికి కృష్ణా జిల్లా లోని గన్నవరం దగ్గరున్న కేసరపల్లి ఐటీ పార్క్ వేదిక కానుందని సీఎంవో అధికారిక ప్రకటన చేసింది.తొలుత  ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారని టిడిపి నేతలు అన్నారు.ఈ ప్రమాణ స్వీకార పనులను అధికార యంత్రాంగం, టీడీపీ ప్రోగాం కమిటీ సభ్యులు దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణానికి నిర్మాణ సామగ్రి, వాహనాలు చేరుకున్నాయి. సుమారు 20 ఎకరాల్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యం లో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రం నుంచి అదనపు బలగాలు కూడా ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా శుక్రవారం ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ స్థలాన్ని పరిశీలించారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ స్థలాన్ని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: