ఇండియాలో.. అందరూ ఊహించినట్లుగానే మరోసారి మోడీ ప్రభుత్వం రాబోతుంది. ఇవాళ మోడీ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి కొలువు ధీరనుంది. ఈ సందర్భంగా ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్ లో ఇవాళ రాత్రి 7 గంటల 15 నిమిషాల నుంచి... 8 గంటల మధ్య ప్రమాణస్వీకారం ఉంటుంది. ఈ సందర్భంగా.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా... మరో 30 మంది కేంద్ర మంత్రులుగా... ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం అందుతుంది.
 

ఇక ఈ ప్రమాణ స్వీకారానికి విదేశా ప్రధానులు, అధ్యక్షులు వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెవరికి కేంద్ర మంత్రి పదవులు వస్తాయని అందరూ చర్చించుకున్నారు. కానీ చివరికి కేంద్ర కేబినెట్ లో... ఇద్దరికీ అవకాశం కల్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. బిజెపి ఎంపీలు అయిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లకు కేంద్ర కేబినెట్లో అవకాశం కల్పించబోతున్నారు. ఇందులో భాగంగానే బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి లకు... ప్రధాని నరేంద్ర మోడీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయి.

 

దీంతో వెంటనే కిషన్ రెడ్డి నివాసం నుంచి... ఒకే కారులో ప్రధాని నివాసంలో జరిగితే నేటి విందుకు... కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కుమార్  లు వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డిలకు  కేంద్ర మంత్రి పదవులు రానున్న నేపథ్యంలో... బిజెపి నేతలు మరియు తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడ్డ వారికి తగిన ప్రతిఫలం వస్తోందని చెబుతున్నారు.



కాగా ఇప్పటికే కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి పని చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు కీలక శాఖ రానుంది. ఇటు కొత్తగా కేంద్రమంత్రి చేపట్టబోతున్న బండి సంజయ్ కి ఎలాంటి పదవి ఇస్తారనే దాని చర్చ జరుగుతుంది. బండి సంజయ్ కి కేంద్ర సహాయ మంత్రి పదవి వస్తుందని సమాచారం అందుతోంది. అటు టిడిపి నుంచి ఇద్దరికీ, బిజెపి నుంచి పురందరేశ్వరి, జనసేన నుంచి బాలషౌరికి ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: