ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు అని చాలామంది తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఒక చరిత్ర, ఒక శకం ముగిసిందని కామెంట్లు చేస్తూ బాధను వ్యక్తం చేస్తున్నారు. కొత్త మార్గాలను ఎంచుకుంటూ రకరకాల రంగాలలో ఉపాధి కల్పించిన ఆయన లేరు అని చాలామంది ఎమోషనల్ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "రామోజీరావు ఎక్కడికీ వెళ్ళిపోలేదు, ఈ లోకంలోనే మళ్లీ మనిషిగా పుట్టారు బాధపడకండి" అంటూ ఆ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
వివరంగా తెలుసుకుంటే, రామోజీరావు అసలు పేరు రామయ్య. ఈ అక్షర ఆదిత్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెదపారుపూడి గ్రామంలోని ఓ ఇంట్లో జన్మించారు. జీవించి ఉన్న కాలంలో ఈ గ్రామానికి ఆయన ఎంతో మంచి చేశారు. తన సొంతంగా 20 కోట్లతో గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారు. అలాంటి మంచి వ్యక్తి చనిపోయారనే వార్త తెలుసుకుని గ్రామస్తులు కంట నీళ్లు పెట్టుకున్నారు. అలా వారు ఏడుస్తున్న సమయంలోనే వారికి ఒక ఊహించని వార్త అందింది.
అదేంటంటే రామోజీరావు జన్మించిన ఇంట్లోనే శనివారం రోజు ఒక మగ బిడ్డ జన్మించాడు. రామోజీరావు చనిపోయిన రోజే, అదే ఇంట్లో మగ బిడ్డ పుట్టాడని తెలిసి, రామోజీ రావే మళ్లీ ఇలా పుట్టాడేమో అని ప్రజలు నమ్ముతున్నారు. దాదాపు 88 ఏళ్ల క్రితం ఒక ఉషా కిరణం లాగా, ఒక ఉదయభానుడి లాగా రామోజీరావు పెదపారుపూడి గ్రామంలోని ఇంట్లో ఉదయించారు. ఆయన కన్నుమూసిన రోజే అదే ఇంట్లో మరో ప్రాణం జీవం పోసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని చాలామంది అంటున్నారు.