ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే కూటమి పార్టీల మధ్య ఇప్పుడే వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన పార్టీ నాయకుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం వర్సెస్ జనసేన మధ్య వివాదం నెలకొంది. మొన్నటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ... గొడవ మర్చిపోకముందే మళ్లీ... కొత్త వివాదం తెరపైకి వచ్చింది.


పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తి గ్రామంలో... తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ కార్యకర్తల మధ్య వార్ చోటుచేసుకుంది. తాడిపర్తి లో... ఇప్పటికే అపర్ణ దేవి అమ్మవారు  వెలిసిన సంగతి తెలిసిందే. అపర్ణ దేవి అమ్మవారు ఉత్సవాలను... ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. మొన్నటి వరకు వైసిపి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో...  ఆ బాధ్యతలు వైసిపి నిర్వర్తించింది. కానీ ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.


దీంతో... అపర్ణ దేవి అమ్మవారు బాధ్యతల కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఆలయ నిర్వహణ  జనసేనకు కావాలి అంటూ.... ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదు లేదు నిర్వాహన కమిటీ బాధ్యతలు... తెలుగుదేశం పార్టీకి కావాలని తెలుగు తమ్ముళ్లు... రచ్చ చేస్తున్నారు. ఒకరి మాట ఒకరు వినకపోవడంతో....  జనసేన, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవ చోటుచేసుకుంది. దీంతో ఇరు పార్టీ నేతలు కొట్టుకున్నారు.


అయితే జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నేతల మధ్య గొడవల నేపథ్యంలో... వైసిపి పార్టీ మాత్రం జనసేన కార్యకర్తలకు సపోర్ట్ గా నిలిచింది. దీంతో పిఠాపురంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాగా రెండు రోజుల కిందట.... జనసేన కార్యకర్తలు కొంతమంది... పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పై దాడి చేసిన సమితి తెలిసిందే. ఎన్నికల కంటే ముందు జనసేన పార్టీలో చేరిన 25 మంది.. వర్మ కారు పై దాడి చేశారు. ఈ సంఘటన మరువక ముందే ఇప్పుడు మళ్లీ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: