కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈరోజు సాయంత్రం 7:15 నిమిషాలకు వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు, ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముప్పైమంది నేతలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. మిగతా వాళ్లు సహాయ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని పచ్చిక బయళ్లలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మోదీ తర్వాత రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు పార్లమెంటు దద్దరిల్లింది. కేంద్ర మంత్రులందరిలో ఇతనే అత్యంత చిన్నవాడు. చాలామంది హేమాహేమీల మధ్య ఈ యంగ్‌స్టర్ కనిపించడం చూసి చాలామంది సంతోషం వ్యక్తం చేశారు. చాలా కాన్ఫిడెంట్‌గా రామ్మోహన్‌ నాయుడు ఇచ్చిన స్పీచ్ కి చాలామంది చప్పట్లు కూడా కొట్టారు. తనను మూడుసార్లు గెలిపించిన శ్రీకాకుళం ప్రజలకు రామ్మోహన్‌ స్పెషల్ థాంక్స్ చెప్పారు. తన తండ్రి ఎర్రన్నాయుడు ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయని, ఆయన ఆశీస్సుల కారణంగానే నేడు ఈ స్థాయికి వచ్చానని అన్నారు.

 చంద్రబాబు సలహాలు, సూచనలు, మార్గదర్శకత్వంలోనే తాను ఈ స్థాయికి రావడం సాధ్యమైంది అని పేర్కొన్నారు. టీడీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఒక బ్రదర్ లాగా తనకు అండగా ఉన్నారని, ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని అన్నారు. భారీ మెజార్టీతో గెలిపించిన ఆంధ్ర ప్రజలకు చెప్పినట్లుగా సంక్షేమ పథకాలను అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే ఏపీని మోదీ, చంద్రబాబు నేతృత్వంలో బాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అటెండ్ అయ్యారు. ఈసారి రామ్మోహన్ నాయుడుతో పాటు ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మలు కేంద్రమంత్రులు అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: