లోకేష్ చాలా ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా ఒకసారి కూడా ఎమ్మెల్యేగా గెలవలేదని, బాబు దయవల్ల మంత్రి వంటి పదవులను అర్హత లేకపోయినా తీసుకున్నారని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. అయితే వాటన్నిటిని పట్టించుకోలేదు తన సత్తా చాటాలని లోకేష్ 5000 పాటు మంగళగిరిలో కసితో పని చేశారు. రకరకాల ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన వారికి సొంతంగా డబ్బులు అందజేశారు. కష్టాల్లో ఉన్న వారికి ఆర్థిక సహాయం చేసే వారి ముఖాల్లో చిరునవ్వును చిందించారు. అయితే ఈ సహాయం చేస్తున్న కూడా ఆయన ఒక్కసారి కూడా వీటి గురించే గొప్పగా చెప్పుకోలేదు. లోకేష్ మంగళగిరిలో ఎవరైనా పెళ్లి జరుగుతుందంటే చాలు బహుమతి పంపించేవారు.
దేవాలయాలు చర్చిలు, మసీదులకు కూడా ఆర్థిక సహాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. చిరు వ్యాపారులకు కూడా సహాయం చేశారు కానీ ఎన్నడూ బయటకి చెప్పుకోలేదు. పబ్లిసిటీ కోసం పాకులాడలేదు. దీని గురించి జగన్ కి తెలిస్తే తన మంచి కార్యక్రమాలను ఆపేస్తారని ఆయన చాప కింద నీరు లాగా తన కార్యక్రమాలను కొనసాగించారు లోకేష్ టీమ్ కూడా కష్టపడి ప్రజలకు మంచి చేయగలిగింది. మంచి చేయాలనే మనస్తత్వంతో పాటు ప్రజలకు తన సహాయం కంటిన్యూగా ఎలా అందాలో కూడా లోకేష్ వ్యూహాలు రచించగలిగారు. చంద్రబాబు గైడెన్స్ లేకుండానే తన సొంతంగా నారావారి అబ్బాయి ప్రజల మనసును గెలుచుకోగలిగారు. ఒక మంచి రాజకీయ నేతకు ఈ ఒక్క లక్షణం ఉంటే చాలు, ఎలాంటి ఎన్నికల్లోనైనా గెలిచేస్తారు. లోకేష్ ఆ లక్షణాన్ని డెవలప్ చేసుకోగలిగారు. కాబట్టి చంద్రబాబు ఇక తన రాజకీయ జీవితం గురించి భయపడాల్సిన అవసరం లేదు. కొడుకుని సీఎం చేసే హాయిగా తన రిలాక్స్ అవ్వచ్చు. పప్పు పప్పు అని మొన్నటిదాకా అన్న వారి చేతనే ఈరోజు లోకేష్ అంటే ఒక ఫైరూ అని చెప్పించగలిగారు లోకేష్. నిజంగా ఆయన అందరికీ ఒక స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు.