అయితే ఇలాంటి నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపునకు.. కారణమైన పవన్ కళ్యాణ్... జనసేన పార్టీని పటిష్టం చేసుకునేoదుకు సిద్ధమవుతున్నాడు. ఇందులో భాగంగానే గత పది సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. తనకు మంత్రి పదవులు రాకున్నా సరే కానీ... జనసేన కోసం కష్టపడ్డ నాయకులకు పదవులు వచ్చేలా చూసుకుంటున్నారట.
ముఖ్యంగా మెగా బ్రదర్, జనసేన కీలక నేత నాగబాబు కు.. ఎలా గైనా మంత్రి పదవి ఇచ్చేలా చంద్రబాబుతో చర్చలు చేస్తున్నారట జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మొన్నటి వరకు టీటీడీ చైర్మన్ గా నాగబాబు నియామకం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని నాగబాబు ఖండించారు. కానీ నాగబాబుకు... ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి... ఆ తర్వాత కేబినెట్ లోకి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్కెచ్ వేస్తున్నారట. ఇప్పటికీ అనకాపల్లి ఎంపీ టికెట్ ను నాగబాబు త్యాగం చేసిన సంగతి తెలిసిందే.
అందుకే జనసేన కోసం కష్టపడ్డ నాగబాబుకు... మంత్రి పదవి కరెక్ట్ అని భావిస్తున్నారట పవన్ కళ్యాణ్. ప్రస్తుత లెక్కల ప్రకారం... మూడు లేదా నాలుగు మంత్రి పదవులు జనసేన పార్టీకి రాబోతున్నాయి. అందులో నాగబాబు పేరు ఉండేలా చూసుకుంటున్నారని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అంతేకాకుండా... గత కొన్ని రోజులుగా జనసేన కోసం కష్టపడుతున్న కిందిస్థాయి లీడర్లకు... జిల్లాస్థాయి పోస్టులు, కార్పొరేషన్ పదవులు ఇచ్చేలా చూసుకుంటున్నారట.