అయితే నారా లోకేశ్ మాత్రం ఇక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేశారు. గతంలో మంగళగిరిలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడంతో పాటు స్త్రీ శక్తి కేంద్రం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించారు. 2024 ఎన్నికల సమయంలో సైతం లోకేశ్ మంగళగిరికే పరిమితమై ప్రచారం సాగించారు.
వైసీపీ నేతలు విమర్శలు చేసినా ఆ విమర్శలను పట్టించుకోకుండా ముందడుగులు వేశారు. తగ్గేచోట తగ్గి నెగ్గేచోట నెగ్గిన లోకేశ్ కు తిరుగులేదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు. మంగళగిరిలో ఎమ్మెల్యేగా గెలవడం ద్వారా బాబు రాజకీయ వారసుడిగా సైతం లోకేశ్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడంతో లోకేశ్ కు మంత్రి పదవి రావడం ఖాయమని తేలిపోయింది.
నారా లోకేశ్ కు మంత్రి పదవి ఇస్తారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండగా లోకేశ్ హోం మినిష్టర్ అవుతారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో మంత్రిగా పని చేసిన అనుభవం ఉండటంతో ఏ పదవి ఇచ్చినా లోకేశ్ మాత్రం సూపర్ సక్సెస్ కావడం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ వ్యూహాలను తెలివిగా చిత్తుచిత్తు చేసి మంగళగిరి తన అడ్డా అని లోకేశ్ ప్రూవ్ చేయనున్నారని తెలుస్తోంది. నారా బ్రాహ్మణి ప్రచారం చేయడం కూడా లోకేశ్ కు ఊహించని స్థాయిలో కలిసొచ్చింది. లోకేశ్ ప్రతిభ వల్ల 39 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో టీడీపీ జెండా ఎగిరింది.