- లోకేష్ లోక నాయకుడు అవుతాడా.?
- భవిష్యత్తులో టిడిపికి దిక్కు లోకేషేనా.?


లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన నాయకుడు. ఎవరైతే ఆయనను పప్పు అని నిందించారో  వాళ్లందరికీ  చెంపపెట్టులా మారారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే అత్యంత  మెజారిటీ తెచ్చుకొని చరిత్ర సృష్టించారని చెప్పవచ్చు.  అలాంటి లోకేష్ ప్రస్తుతం టిడిపి పార్టీలో కీలక లీడర్ అవ్వబోతున్నారు. చంద్రబాబు రాజకీయ వారసత్వాన్ని కాపాడే శక్తి కూడా తెచ్చుకున్నారు. అలాంటి లోకేష్  మంగళగిరిలో మరపురాని మెజారిటీ సంపాదించారు. టిడిపి కీలక లీడర్ అయినటువంటి లోకేష్ పై ఎలాంటి కర్తవ్యాలు ఉన్నాయి. ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం. స్టాన్ ఫోర్డ్ లో ఉన్నత చదువులు చదివినటువంటి లోకేష్ ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం వదిలి ప్రజాసేవకై అంకితమయ్యారు. తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి అయినా కానీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం కోసం పరితపించారు. యువగళం పేరుతో పాదయాత్ర స్టార్ట్ చేసి తన గళం వినిపించి రాష్ట్రమంతా ఏకం చేశాడు.

 
 రాజకీయ జీవితం:
 లోకేష్ వరల్డ్ బ్యాంకులో జాబ్ చేస్తున్న తరుణంలోనే  తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2009లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేష్ అప్పటి మేనిఫెస్టో తయారు చేయడంలో కూడా ఆలోచనలు చంద్రబాబుకు ఇచ్చారట. 2013లో పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి టిడిపి పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఆయన రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన పనులను చూసి టిడిపి కేడర్ ఈయన రాజకీయాలకు పనికిరాడనే ఆలోచనకు వెళ్ళిపోయింది. ప్రతిపక్ష నాయకులైతే పప్పు అని ముద్రవేశారు. ఈ విధంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కూడా లేవని చెప్పేసి టిడిపికి ప్రధాన దిక్కు ఎవరూ అనే ఆలోచనలో పడ్డారు. ఈ టైం లోనే 2014లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇదే టైంలో లోకేష్ ని ఎలాగైనా రాజకీయాల్లోకి తీసుకువచ్చి అనుభవం వచ్చేలా చేయాలనుకున్నారు. ఇదే తరుణంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు.  దీంతో ప్రజలు ఓట్లు వేయకుండా ఎమ్మెల్సీ పదవి తీసుకొని మంత్రి అయిన మొదటి వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఈయన మరింత చులకన అయిపోయారు.


ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేశారు. కానీ  ఓడిపోయారు. ఓటమి నుండి గుణపాఠం నేర్చుకున్న లోకేష్  ఎలాగైనా 2024 ఎన్నికల్లో గెలవాలని కంకణం కట్టుకొని ఆ ప్రాంతంలోనే ఉంటూ అందరి ప్రజలను ఏకం చేస్తూ తను అంటే ఏంటో నిరూపించుకున్నాడు.  చివరికి లక్ష మెజారిటీకి దగ్గర ఓట్లు సంపాదించుకొని మంగళగిరిలో విజయకేతనం ఎగరవేశారు. అలాంటి లోకేష్ పై అనేక బాధ్యతలు ఇప్పుడు వచ్చి పడ్డాయి. ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ లో మంచి పాలన ఇవ్వడమే కాకుండా టిడిపి క్యాడర్ కూడా లోకేష్ ఏంటి అనే విధానాన్ని చూపించుకోవాలి. తన తండ్రి రాజకీయాల నుండి బయటకు వచ్చిన తర్వాత లోకేష్పార్టీ ని లీడ్ చేసేంత శక్తి సంపాదించుకోవాలి. తెలంగాణలో కేటీఆర్ ఏ విధంగా ఎదిగారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో లోకేష్ కూడా ఎదిగే విధంగా తనకు తానే దారులు వేసుకోవాలి.  ఆయనపై టిడిపి పార్టీ కార్యకర్తలకు అంతా నమ్మకం కలిగి, ప్రజల ముందు కూడా తానేంటో నిరూపించుకోగలిగితే  ఇక టిడిపిని లోకేష్ కాపాడగలడు అనే నమ్మకం టిడిపి క్యాడర్ కి వస్తుంది. దానికోసం ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు. ముందు ముందు ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తారు అనేది చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: