చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం బలమైనదని పేర్కొన్నారు. ప్రజలకు మేలు గలిగేలా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా పరిపాలించాలని ఆశీర్వాదం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం తో ఉండే సన్నిహిత సంబంధాలతో చంద్రబాబు గొప్పగా పాలించగలరని ఆశిస్తున్నామన్నారు. అమరావతి లో కూడా శారదా పీఠం నిర్మిస్తామని ప్రకటించారు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
ఏ ప్రభుత్వం వచ్చినా నిష్పక్షపాతంగా రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు ఉంటాయ్ అని వివరించారు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి. త్వరలోనే చాతుర్యాస పూజలకోసం రుషికేశ్ వెళ్తున్నా, అందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే ఆశీస్సులు అందిస్తున్నానని వివరించారు. హైదరాబాద్ లోని శారదా పీఠం లో స్థిరపడాలని అనుకుంటున్నామని చెప్పారు. నాకు అత్యంత ఆత్మీయుడు ఆయిన ఎర్రన్నాయుడు కుమారుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రి కావడం సంతోషంగా ఉందని ఎమోషనల్ అయ్యారు శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి.
అమ్మ వారి కృప చేత మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేయడం ఆనందం కలిగించిందని తెలిపారు. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికో భయపడి కాదని... స్వరూప నంద ఎప్పుడు ఒకేలా ఉంటారు భయపడి కాదని వెల్లడించారు. ఈ సారి అయినా దేవాదాయ ధర్మా దయ శాఖ సరైన పాలన చేయాలని కోరారు. ఏడు రాష్ట్రాల నుండీ గవర్నర్ లు పీఠానికి వచ్చారని తెలిపారు.