ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి ప్రస్తుతం ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె వైసీపీ హయాంలో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఆ దుర్వినియోగం ఏంటంటే, భారతి తన పనిమనిషిలలో కొందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించారట. తమ హౌస్ వర్కర్లకు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆయా ప్రభుత్వ శాఖలకు రికమెండ్ చేశారట. భారతి చేసిన రికమండేషన్ల కారణంగా గత 3 నెలల్లో దాదాపు 60 మందికి ఉద్యోగాలు లభించినట్లు ప్రచారం జరుగుతోంది.

 భారతీయ ఇంట్లో పని చేసిన అనేక మంది వ్యక్తులు అగ్నిమాపక శాఖలో హోంగార్డులు, ఇతర ఉద్యోగాలు సంపాదించారట. ఇతరుల లాగా కాకుండా వారు ఎలాంటి పరీక్షలు రాయకుండానే ఈ ఉద్యోగాలు పొందారట. భారతి సిఫార్సు చేయడంతో వెంటనే వారికి  ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సామాన్య ప్రజలు కోచింగ్‌లు, ట్రైనింగ్‌లు అంటూ చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారికి కాకుండా అర్హత లేని వారికి, అక్రమ మార్గంలో ఉద్యోగాలు ఇవ్వడం తప్పే అవుతుంది. అధికారాన్ని దుర్వినియోగం కూడా చేసినట్లు అవుతుంది.

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, సీఎం జగన్‌ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తమ దుర్వినియోగానికి పాల్పడి అందరికి ఉద్యోగాలు ఇప్పించారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత గడిచిన ఐదేళ్లలో ఎవరెవరు ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో తెలుసుకునేందుకు టీడీపీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ ఎర్ర బుక్కు పేరిట ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు. గనుల విషయంలో జరిగిన అవగతవకలను బయటపెట్టే క్రమంలో కొన్ని ఆఫీసులను సీజ్ చేశారు. అన్ని రంగాలలో ఎలాంటి ఆక్రమాలు జరిగాయి పరిశీలించేందుకు ఇప్పుడు పోలీసులు, అధికారులు అందరూ సిద్ధమయ్యారు. మరోవైపు వైసీపీ కోసం పనిచేసిన ఐపీఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ బయట బదిలీలు చేయించుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: