నాని బూతులే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. తెలుగుదేశం వీరాభిమాని అనేవాడు ఎక్కడ ఉన్నా వాడిలో ఈ సారి గెలవాలన్న కసికి కారణమయ్యాయి. ప్రతి ఒక్కరిలో పట్టుదల పెంచాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే కిక్ కాదప్పా.. గుడివాడలో నానిమీద రాము గెలిస్తేనే కిక్ అనుకున్న వాళ్లకు రాము త్రిబుల్ కిక్ ఇచ్చి పడేశాడు. గెలుపు కాదు సామి.. ఏకంగా 53 వేల మెజార్టీ. నాని తాను ఓడిపోను.. దమ్ముంటే లోకేషో, బాబో రావాలని సవాల్ విసిరాడు.. అసలు ఎందుకు రాజకీయం అనుభవం లేని రాముతోనే ఏకంగా 53 వేలతో నానిని ఓడించారు.. అదే బాబో, లోకేషో అక్కడ పోటీ చేసినా.. లేదా బాలయ్య బరిలో ఉన్నా ఈ మెజార్టీ ఇంకా ఎంత ఎక్కువ ఉంటుందో... నాని ఇంకెంత ఘోర పరాజయం చూసేవాడో అన్న లెక్కలు, చర్చలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
రాముకు ఇంత మెజార్టీ రావడానికి కొడాలి నాని తీరు, అటు కూటమి వేవ్ మాత్రమే కాదు... రాము వ్యక్తిత్వం... ఆయనపై గుడివాడ ప్రజలు పెట్టుకున్న నమ్మకం.. గుడివాడకే స్పెషల్‌గా ఇచ్చిన హామీల్లో ఎన్నికలకు ముందే నెరవేర్చి చూపించడం... పేద్ద పేద్ద మాటలు చెప్పకుండా.. గుడివాడ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రతి ఇంటికి మంచినీళ్లు, రహదారుల అభివృద్ధి ఈ హామీలే రాములో నిజాయితీని గుడివాడ ప్రజానీకానికి పార్టీలతో సంబంధం లేకుండా బాగా కనెక్ట్ చేశాయి. ఈ ఘనవిజయంలో పై కారణాలే కాదు.. రాము మీద నమ్మకం కూడా స్పష్టంగా మెజార్టీలో కనిపించేసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవ్వరికి రాని విధంగా గుడివాడలో రాముకు ఏకంగా 64 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. ఇదో రికార్డుగా నిలిచింది. ఇక గుడివాడ యువతకు 10 వేల ఉద్యోగాలిస్తానని చెప్పిన రాము... తాను ఎమ్మెల్యే అవ్వడానికి ముందే తన ఫండేషన్ ద్వారా 2 వేల ఉద్యోగాలు ఇచ్చారు. వచ్చే అయిదేళ్లలో 10 వేల ఉద్యోగాలిచ్చి మాట నిలబెట్టుకుంటానని చెప్పారు. ఇక ఇప్పటికే ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా ప్రారంభించారు. వచ్చే రెండేళ్లలో గుడివాడలో ఇంటింటికి సురక్షిత మంచినీటి సౌకర్యం కల్పించేలా ప్లానింగ్ చేసుకున్నారు. కొడాలి నాని బాధితులకు సైతం న్యాయం చేస్తున్నారు. నానికి అన్ని విధాల చెక్ పెట్టాలన్నా, గుడివాడ అభివృద్ధి చేయాలన్న అది కేవలం రాముతోనే సాధ్యం అన్నట్లు ఉంది ఇప్పుడు గుడివాడలో పరిస్థితి.
రాము మంత్రి పదవికి గట్టి పట్టు..
ఈ క్రమంలోనే ఈ సారి రాముకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని మెజార్టీ ఎన్నారైలు... మరీ ముఖ్యంగా అమెరికా నుంచి.. అమెరికాలో ఉన్న మెజార్టీ తెలుగు సంస్థల నుంచి భారీ ఎత్తున లాబీయింగ్ స్టార్ట్ అయ్యిందని.. ఇటు చంద్రబాబుపై ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయని సమాచారం. అందులోనూ ఎన్టీఆర్ ప్రాథినిత్యం వహించిన గుడివాడకు మంత్రి పదవి వస్తే... గుడివాడను ఓ రేంజ్‌లో అభివృద్ధి చేసుకోవచ్చన్న థాట్ లోకల్‌గా కూడా గట్టిగా నడుస్తోంది. మరి రాము అదృష్టం ఎలా ఉందో చూడాలి.