2024 ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ అవమానకర ఓటమిని చవి చూసిన సంగతి తెలిసిందే. వైసీపీ సీనియర్ నేతలు అందరూ కూడా ఈసారి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. వైసీపీ జస్ట్ 4 ఎంపీ, 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. వైసీపీ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు. రాష్ట్రం, కేంద్రం రెండిటిలోనూ వైసీపీకి అండ లేకుండా పోయింది. బీజేపీ, టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు. వైసీపీ ఈ రెండు పార్టీలకి వ్యతిరేకమే. జగన్ మళ్లీ అధికారంలోకి రావాలంటే పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయనకు చాలామంది షాక్‌లు ఇస్తున్నారు. రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ నుంచి వెళ్లిపోవడమో, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగడమో చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని జగగ్‌కు ఊహించని షాక్ ఇచ్చారు. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతున్నట్లు తాజాగా అనౌన్స్ చేశారు. ఈ షాకింగ్ నిర్ణయాన్ని ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిపించిన ఆ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరమైనా విజయవాడ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. అందుకు ఎవరితో కలిసి పని చేయడానికి అయినా తాను సిద్ధమని స్పష్టం చేశారు. అలానే సుదీర్ఘ కాలం పాటు తన రాజకీయ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే కేశినాని నాని 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2024లో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మరోసారి పోటీ చేశారు కానీ తన తమ్ముడు కేశినేని శివనాధ్ చేతిలో ఓడిపోయారు. ఆయన ఓడిపోయినా వైసీపీ గెలిచి ఉంటే రాజకీయాల్లో కచ్చితంగా ఉండేవారు. కానీ ఈసారి టీడీపీ కూటమి సునామీ లాగా అందరినీ ముంచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: