73 ఏళ్ల వయసులో, నరేంద్ర మోదీ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి అయ్యారు. కేబినెట్ 3.0లో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన రాష్ట్ర మంత్రులు, 36 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎవరెవరు ఏయే శాఖలకు మంత్రులయ్యారో తెలుసుకుందాం.
- రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను బీజేపీ నేత నితిన్ గడ్కరీ పర్యవేక్షించనున్నారు.
- రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలో అజయ్ తమ్తా, హర్ష్ మల్హోత్రా రాష్ట్ర మంత్రులుగా మారనున్నారు.
- రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ తన పదవిని కొనసాగించనున్నారు.
- వ్యవసాయ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు.
- జితన్ రామ్ మాంఝీ MSME మంత్రి అయ్యారు.
- బీజేపీ సీనియర్ లీడర్ అమిత్ షా మళ్లీ హోమ్ మంత్రిగా కొనసాగుతారు.
- జై శంకర్ విదేశాంగ శాఖ మంత్రి పదవిని రిటైన్ చేసుకున్నారు
- రాజ్‌నాథ్ సింగ్ ఈసారి కూడా రక్షణ శాఖ మంత్రిగా భారతదేశానికి విశేష సేవలు అందించనున్నారు.
- సర్బానంద సోనోవాల్ ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రిత్వ శాఖను రిటైన్ చేసుకున్నారు. అంటే పోయినసారి ఇదే శాఖకు ఆయన మంత్రి అయ్యారు.
- నిర్మలా సీతారామన్ మళ్లీ కేంద్రం ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం & నేచురల్ గ్యాస్ శాఖకు మంత్రి అయ్యారు.
పైన చూసుకుంటే మోదీ పోయినసారి ఎవరికి ఏ శాఖలను ఇచ్చారో ఈసారి కూడా అవే శాఖలు అప్పజెప్పారు. గడిచిన ఐదేళ్లలో రైల్వే మంత్రిగా అశ్విని వైష్ణవ్ అద్భుతంగా పనిచేశారు, రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్ కూడా ఇచ్చిన పదవుల్లో బాగా రాణించి దేశానికి చాలా మేలు చేశారు. అందుకే మళ్లీ వారికే ఆయా శాఖలను అందించినట్లు తెలుస్తోంది.