కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే. 294 సీట్లను కైవసం చేసుకున్న ఎన్డీఏ... ఆదివారం రోజున కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా...  ప్రధాని నరేంద్ర మోడీ... మూడవసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.  ఇక మోడీ 3.0 కేబినెట్లో... రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ అలాగే తెలంగాణ నుంచి పలువురు ఎంపీలకు ఛాన్స్ వచ్చింది.


తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏకంగా ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఆదివారం రోజున నరేంద్ర మోడీతో పాటు ఐదుగురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలంగాణ నుంచి... తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టిడిపి పార్టీ తరఫున...రామ్మోహన్ నాయుడు, పొమ్మసాని చంద్రశేఖర్ , బిజెపి పార్టీ నుంచి  శ్రీనివాస వర్మ  కు కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి.

 

 అయితే ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మోడీ ప్రభుత్వం ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం దగ్గుబాటి పురందరేశ్వరికి  లోక్సభ స్పీకర్ పదవి రానుందట. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిపారట బిజెపి పెద్దలు. ఒక మహిళను స్పీకర్ చేస్తే బిజెపికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.



 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొట్టమొదటి వ్యక్తి లోక్సభ స్పీకర్ కావడం కూడా... తెలుగుజాతికి గొప్ప గౌరవం అని చెప్పవచ్చు. గతంలో బాలయోగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తరఫున లోక్సభ స్పీకర్ అయ్యారు. ఆయన తర్వాత ఇప్పుడు దగ్గుబాటి పురందరేశ్వరికి  ఆ చాన్స్ వచ్చింది. ఒకవేళ లోక్సభ స్పీకర్ దగ్గుబాటి పురందరేశ్వరికి వస్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గం నాయకులు తెరపైకి రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: