సిని పరిశ్రమ ఇంత అద్భుతంగా రావడానికి ముఖ్య కారణం రామోజీరావు అని చాలామంది ఎన్నో సందర్భాలలో తెలియజేస్తూ ఉంటారు. పత్రికా రంగంలో కూడా ఎన్నో సేవలందించారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం రామోజీరావు మరణంతో చాలామంది సినీ సెలబ్రిటీలు ప్రముఖ నేతలు సంస్థ అధినేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు మాత్రం రామోజీరావు తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఉన్నారు. తాజాగా రామోజీరావు మనవరాలు తమ తాతయ్య తో ఉన్న అనుబంధాలను సైతం తెలియజేశారు. ముఖ్యంగా ఈనాడు పత్రికలోని మహిళా పేజీ అయిన వసుంధరలో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

రామోజీ కుటుంబ విషయానికి వస్తే ఆయనకు ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు కిరణ్ ఆయన ఈనాడు వ్యవహారాలను చూస్తూ ఉంటారట. ఈయన భార్య శైలజ ఈమె మార్గదర్శి వ్యవహారాలను చూస్తూ ఉండేది.. ఇక చిన్న కొడుకు సుమన్ అనారోగ్య కారణంగా మరణించినట్లు సమాచారం. ఈయన భార్య విజయేశ్వరి.. పెద్ద కుమారుడికి ముగ్గురు సంతానం అయితే రెండు కొడుక్కి ఇద్దరు సంతానం.. మొదటి కొడుకు (కిరణ్ ,శైలజ )దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు కాగా రెండో కొడుకుకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి జన్మించారు.


రామోజీరావు మనవళ్లు మనవరాలు సైతం తమ తాతయ్య తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తే అందరికంటే చిన్న మనవరాలు దివిజ ఆసక్తికరమైన విషయాలు తెలిపింది. తన తాతయ్య తనతో చెప్పిన ఆఖరి మాటలు చాలా కీలకంగా ఉన్నాయట ఎందుకంటే తెలుగు రాజకీయాల గురించి వారు మాట్లాడుకోవడమే అందుకు ప్రాధాన్యం.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తాతయ్యను ఇలా అడిగానని.. ఏది ఏమైనా ధర్మమే గెలుస్తుంది కదా తాతయ్య అని అనగా.. అప్పుడు రామోజీరావు ధర్మం ఊరికే గెలవదు దాన్ని రక్షించడానికి చాలామంది పోరాడాలి చాలా త్యాగాలు చేయాలని చెప్పారట. అవి ఆయన మాతో చివరిగా మాట్లాడిన మాటలు అని తెలిపింది.


అంతేకాకుండా తమ తాతయ్య ఎప్పుడూ కూడా ఒకనక సందర్భంలో తెల్ల బట్టలే వేసేవారు మీకు బోర్ కొట్టదా తాతయ్య అని అడిగినప్పుడు తన తాతయ్య.. తెలుపు స్వచ్ఛతకు ప్రతిరూపం చేసే పని పట్ల మనం స్వచ్ఛంగా ఉండాలి అనేది గుర్తు చేస్తూ ఉంటుందని తెలిపారట. అలాగే తన మన వల్ల మీద మనవరాలు మీద ఎప్పుడు కూడా కోప్పడలేదని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: