రాష్ట్రవ్యాప్తంగా 65.03 లక్షలమంది పింఛని లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు పింఛన్ ని నగదు చెల్లింపుగా నెలకు 1,939 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఏప్రిల్ నుంచి 4000 పింఛన్ అమలు చేస్తే ఒక్కొక్కరికి ₹7000 చొప్పున జూలై 1 నుంచి పంపిణీ చేయాల్సి ఉన్నది. పెరిగిన పింఛన్ 4వేల తో పాటు ఏప్రిల్ మే జూన్ నెలలో 1000 చొప్పున మొత్తం మీద 3000 కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి ₹7,000 పంపిణీ చేయవలసి ఉంటుంది. దివ్యాంగులకు 6000 చొప్పున ఇలా మొత్తం మీద కలుపుకుంటే జులై 1 నాటికి 4,400 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.
ఆగస్టు నుంచి ప్రతినెల 2,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందట. దివ్యాంగులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారట. అలాగే పూర్తిగా అంగవైకల్యం ఉన్నవారికి 15 వెలు.. కిడ్నీ తల సేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉన్నవారికి పదివేల రూపాయలని మేనిపొస్ట్ లో తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామంటూ కూడా మేనిఫెస్టోలో తెలిపారు. రేపటి రోజున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇందుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందుకు సంబంధించి వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ పలు రకాల విషయాలను సేకరిస్తున్నట్లు సమాచారం.