ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో భారతదేశవ్యాప్తంగా ఎంపీలుగా గెలిచిన వారిలో ఎక్కువగా బీజేపీ, 'ఇండియా' కూటమి సభ్యులే ఉన్నారు. వీరికి పోటీగా నిలిచి గెలవడం అనేది చాలా కష్టమని చెప్పుకోవచ్చు ఎందుకంటే అవి బలమైన జాతీయ, రాష్ట్ర పార్టీలు. వారికి పోటీగా ఎంతోమంది స్వతంత్రంగా నిలబడ్డారు వారిలో ఏడుగురు గెలిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అత్యంత ముఖ్యమైన ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులపై పోటీ చేయడం కత్తి మీద స్వాము లాంటిదే. నా వీళ్లు ధైర్యంగా పోటీ చేసి గెలిచారు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం.

పప్పూ యాదవ్ (బిహార్)

సంపదతో పాటు చాలా బలగం కలిగిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ రాబిన్‌హుడ్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. కొంతకాలం క్రితం రాజకీయాల్లో అడుగుపెట్టిన ఈ బిహారీ నేత 2024 ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. పప్పూ యాదవ్ బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 23,847 ఓట్లతో గెలుపొందారు. ఆయన సమీప ప్రత్యర్థి జనతాదళ్ నేత సంతోష్ కుమార్‌.

ఇంజినీర్‌ రషీద్ (జమ్మూ కశ్మీర్)

అబ్దుల్ రషీద్ షేక్ ఇంజినీర్ రషీద్‌గా పాపులర్ అయ్యారు. ఆయన ఈసారి ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌ క్యాండిడేట్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. రషీద్ జైలు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరిగా నిలిచారు. వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఆయనను కొద్ది రోజుల క్రితం అరెస్టు చేశారు ఇప్పుడు ఆయన తీహార్ జైల్లో శిక్షణ అనుభవిస్తున్నారు. రషీద్ జైల్లో నుంచే పోటీ చేసి జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై గెలుపొందారు.

అమృత్‌పాల్ సింగ్ (పంజాబ్)

అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లోని ఖడూర్ సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గ నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్‌పై దాదాపు రెండు లక్షల మార్జిన్ సాధించారు. అమృత్‌పాల్ పంజాబ్‌లోని ప్రో-ఖలిస్తాన్ సంస్థ అయిన 'వారిస్ పంజాబ్ దె' చీఫ్‌గా పనిచేస్తున్నారు.

సరబ్‌జీత్ సింగ్ ఖల్సా (పంజాబ్)

2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి ఘన విజయం సాధించారు సరబ్‌జీత్. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా సరే ఈ నేత ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కరమ్‌జీత్ సింగ్ అన్మోల్‌‌పై 70 వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఇతడి తండ్రి భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని హత్య  చేసిన బాడీ గార్డ్స్‌లో ఒకరు కావడం విశేషం. ఆయన పేరు బియాంత్ సింగ్.

విశాల్ పాటిల్ (మహారాష్ట్ర)

కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి విశాల్ పాటిల్ అలియాస్ విశాల్‌దాదా ప్రకాశ్‌బాపు పాటిల్ సంగ్లీ లోక్‌సభ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి బీజేపీ నేత సంజయ్ పాటిల్‌పై అఖండ విజయం సాధించారు.

కేంద్రపాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియూ నుంచి ఉమేశ్‌భాయి పటేల్, లద్దాఖ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ హనీఫా కూడా ఇండిపెండెంట్‌గా కాంటెస్ట్ చేసి గెలిచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: