ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజల బాగు కోసమే చూస్తానని తాము తీసుకుని ప్రతి నిర్ణయం కూడా జనం కోసమే ఉంటుందంటూ తెలిపారు చంద్రబాబు. ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగుతుందంటూ కూడా తెలియజేశారు.. గత పాలకుల హయాంలో జేపీ రాజధాని ఏంటో చెప్పులేని పరిస్థితి ఏర్పడిందని మూడు రాజధానుల ముచ్చటగానే ఉందంటూ వెల్లడించారు.. విశాఖను రాజధాని చేస్తామని చెప్పినప్పటికీ అక్కడ కూటమిని ప్రజలు 70 నుంచి 90000 ఓట్లతో గెలిపించారు అంటూ తెలిపారు. విశాఖ పట్నం అంటే తనకు కూడా చాలా అభిమానం అని తెలిపారు చంద్రబాబు.
మూడు రాజధానులు అంటూ కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తామంటే అక్కడ వాసులకు ఒరిగేదేమీ లేదని చంద్రబాబు పాలకులు మోసాన్ని గమనించిన రాయలసీమ వాసులు కూడా తిరగబడ్డారని కూడా తెలిపారు. ఈ విజయం చరిత్రలో ఎవరూ చూడని విజయమంటూ తెలిపారు.. జిల్లాలకు జిల్లాలే కూటమికి పట్టం కట్టారని గత ఐదేళ్లలో రాష్ట్రం చాలా నష్టపోయిందంటూ చంద్రబాబు తెలిపారు. తన అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువస్తానంటూ చంద్రబాబు వెల్లడించారు.అన్ని రంగాలలో కూడా ఏపీని నెంబర్ వన్ గా చేస్తానంటే తెలిపారు. పోలవరం పనులు 72 శాతం పూర్తి అయ్యాయని. అలాగే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముందు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయంటూ తెలియజేశారు.