అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడమే కాదు.. మంత్రివర్గ విస్తరణ కూడా చేయబోతున్నారు అన్నది తెలుస్తుంది. దీంతో ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది అనే విషయంపై ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఇలా మంత్రివర్గ విస్తరణ సమయంలో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఎమ్మెల్యేగా గెలవని వ్యక్తులు సైతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంటుందట. సీఎం సిఫారసు చేసిన వ్యక్తితో ఎమ్మెల్యేగా గెలవక పోయినప్పటికీ ఇక గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారట.
అయితే ఇలా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు ఆరు నెలల్లోగా అసెంబ్లీ లోనైనా లేదంటే శాసన మండలిలో నైనా సభ్యుడిగా ఎన్నికవ్వాలి. లేదంటే ఇక సదరు నేత మంత్రిగా పని చేయడానికి వీలు ఉండదు అని చెప్పాలి. గతం లో చంద్రబాబు వారసుడు లోకేష్ విషయం లో కూడా ఇదే జరిగింది. మంత్రివర్గ విస్తరణలో లోకేష్ కు ఐటి మినిస్టర్ గా పదవి దగ్గర దక్కింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన లోకేష్ కి ఆరు నెలల కాలంలో శాసనమండలి సభ్యులుగా ఎన్నిక కావడంతో ఇక మంత్రి పదవిలోనే కొనసాగారు.