ఇకపోతే ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతూ.. చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అమలు చేస్తూ.. ప్రజలకు మేలు జరిగేలా పాలన సాగిస్తే.. కూటమికి తిరుగుండదు. చంద్రబాబు వైపు నుంచి తప్పు చూపే ఛాన్స్ లేకపోతే చట్టం నుంచి కూడా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. న్యాయపరమైన సమస్యలకు తావివ్వకుండా.. చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటే.. బాబు ఐదేళ్ల పాలన సాగితే చట్టం తన పని తాను సాగిస్తుందని ఏపీ ఓటర్లు చెబుతున్నారు.
మరి ఓటర్లు అనుకున్న విధంగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశ వైపు తీసుకు వెళ్లేలా ప్రయత్నం చేయాలి. అటు యువతకు ఇటు నిరుద్యోగులకు, మహిళలకు, పిల్లలకు, సామాజిక వర్గాల వారిని ఇలా అందరిని దృష్టిలో పెట్టుకొని పరిపాలన సాగిస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఎన్నికల్లో కూడా మళ్లీ బాబే సీఎం అవుతారనటంలో సందేహం లేదు.