ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం వైసిపి అందించిన సంక్షేమ పథకాలు తమను అధికారంలోకి తిరిగి 2024లో తీసుకువస్తాయని చాలా ధీమాతో ఉన్నారు.. కానీ అనూహ్యంగా కూటమికి 164 సీట్లు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా అక్కా చెల్లెమ్మల పేరుతో కొన్ని కోట్ల రూపాయలు వేసానని.. సంక్షేమం పేరుతో ప్రజలకు డబ్బులు మాత్రమే వేసి.. వారిని తన వైపు తిప్పుకున్నారు అనుకొనే ధీమాతో ఉండేవారు. రాజకీయమంటే కొనడం అమ్మడం మాత్రమే అని అనుకున్నారు.. ఇలాంటి వాటి నుంచి బయటికి వచ్చి పరిపూర్ణ రాజకీయ నేతగా జగన్ ఎదిగితే తప్ప రాజకీయం చేయలేరని చెప్పవచ్చు.



రాజకీయం చేయాలి అంటే .. ఆంధ్రాలో కత్తి మీద సామ లాంటిదని చెప్పవచ్చు.. ముఖ్యంగా చాలా ఓర్పుగా సెన్సిటివ్ గా ఉంటూ తన మెచ్యూరిటీని చూపించుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అన్ని రకాల వాటిలో ముందుండేలా చూడాలి కేవలం సంక్షేమం, సింపతి వంటి వాటి మీద ఆధారపడితే రాజకీయం చేస్తే ఎక్కువ రోజులు పరిపాలన చేయలేరు. జనాలకు కూడా ఈ విషయం పైన బోరు కొట్టేస్తుంది. ప్రజలు కూడా లీడర్ వైపు అసలు చూడరు.. రాజకీయాలలో సినిమాలలో కొత్తదనం చూపిస్తేనే లీడర్గా ముందుకు వెళ్తారు.


జనాలను ఎంటర్టైన్మెంట్ చేస్తే ముందుకు వెళుతూ ఉండాలి.. ముఖ్యంగా రాజకీయం అంటే సంక్షేమం మాత్రమే కాదు ఇంకా చాలానే ఉంటాయి.. ఈ అపజయాన్ని జగన్ అసలు మర్చిపోలేరు అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో సంక్షేమ పథకం మీద ఆధారపడిన జగన్ ఇక మీదట అలా కాకుండా కం బ్యాక్ భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో జగన్ మంత్రులను కూడా నోరు అదుపులో పెట్టేలా చూసుకోవాలి ముఖ్యంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.. అలాగే తమ సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి.. కేవలం కావాలని చాలామంది దుష్ప్రచారం కూడా చేస్తున్నారు అలాంటి వారికి తావు ఇవ్వకుండా చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అలాగే సంక్షేమమే కాకుండా అభివృద్ధి వైపుగా కూడా అడుగులు వేస్తూ ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళుతూ ఉండాలి. ముఖ్యంగా తను చెప్పిన మాట చేస్తారని ప్రజలలో ధీమా కనిపిస్తోంది కనుక ఎలా చెప్పినా నమ్ముతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: