జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారంతో పవన్ కు  ఇన్నిరోజులు లేని పవర్ ఈరోజు వచ్చేసింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ 21 స్థానాల్లో విజయం సాధించిన నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన వాళ్లు పవన్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. కాపులకు ప్రయోజనం చేకూరేలా పవన్ కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆ వర్గాలకు చెందిన ఓటర్లు ఫీలవుతున్నారు.
 
కాపు వర్గానికి చెందిన వాళ్లలో సైతం పేదవాళ్లు ఉన్నారు. అలాంటి వాళ్లకు తగిన న్యాయం జరిగేలా పవన్ మాత్రమే చేయగలరని వాళ్లు నమ్మారు. మరోవైపు ఏపీలో అన్ని అర్హతలు ఉన్నా సంక్షేమ పథకాలు అందని వాళ్లు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అలాంటి వాళ్లు సైతం పవన్ ను నమ్మి ఈ ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇచ్చామని కూటమికి ఓట్లు వేశామని అభిప్రాయాలు వ్యక్తపరుసున్నారు.
 
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలకు పరిమితం కావాలని పవన్ కు మద్దతు ఇచ్చిన ఏపీ ఓటర్లు చెబుతున్నారు. పవన్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉంటే మాత్రమే తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు చేసిన తప్పులు రిపీట్ కాకుండా చేయాల్సిన బాధ్యత సైతం పవన్ పై ఉంది.
 
రియల్ లైఫ్ లో కూడా పవర్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ తన పవర్ కు పూర్తిస్థాయిలో న్యాయం చేయాల్సిన బాధ్యత అతనిపై ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో 21 స్థానాల్లో గెలిచిన జనసేన 2029 ఎన్నికల్లో సొంతంగా గెలిచే స్థాయికి ఎదగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనసేన భవిష్యత్తు వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనే ప్రశ్నకు మాత్రం కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: