ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో హాజరు కావడానికి మెగా ఫ్యామిలీ నిన్ననే విజయవాడకు వచ్చి బస చేసింది, స్పెషల్ బస్సులో ప్రమాణ స్వీకారోత్సవా కార్యక్రమం జరిగిన వెన్యూ వద్దకు వచ్చింది. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, నాగబాబు, నిహారిక సహా చాలామంది మెగా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పవన్, రేణు దేశాయ్ ల కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్య కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు. పవన్ ప్రస్తుత సతీమణి అన్నా లెజీనోవా కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పవన్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు మెగా ఫ్యామిలీ మెంబర్స్ చప్పట్లు కొడుతూ హోరెత్తించారు. మొబైల్ ఫోన్స్‌లో ఆ అద్భుతమైన దృశ్యాలను రికార్డు చేసుకున్నారు.
అయితే మంత్రి పదవికే ఇలా వీళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇంత అల్ప సంతోషిగా మెగా ఫ్యామిలీ ఎందుకు ఉంటుందని ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే జనసైనికులందరితో కలిసి మెగా ఫ్యామిలీ కూడా పవన్‌ను ఏపీ సీఎంగా చూడాలనుకున్నారు. అందరూ గొంతు ఎండిపోయేలా సీఎం సీఎం అంటూ పవన్ ను బాగా ఎలివేట్ వెయిట్ చేశారు. ప్రస్తుతానికి అయితే వారు సంతృప్తి చెందుతున్నారు. కానీ సీఎం అయ్యేలాగా ఆయనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పవన్ సాధించింది కొంత, సాధించాల్సింది కొండంత అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి కానీ అతి చేయకూడదు అని మరి కొంతమంది సలహా ఇస్తున్నారు.
ఇకపోతే పవన్ ఏపీలో తొలిసారి ఎమ్మెల్యే, ఆపై మంత్రి కూడా అయ్యారు. పదేళ్లు పడిన ఆయన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించింది. ముందు రోజుల్లో ఆయనే ఏపీ సీఎం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి పాపులర్ పొలిటిషన్లు కూడా జోష్యం చెప్పారు. సో, రియల్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి జన సైనికులు ఆ టైం కోసం వెయిట్ చేయాల్సిందే.