ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే మాసంలో జరిగిన పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు సంపాదించుకున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ... 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి తీవ్రస్థాయిలో నష్టపోయింది. ఎవరు ఊహించని విధంగా దారుణంగా ఓడిపోయింది వైసీపీ పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీలు ఏకమై... జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టారు.


దీంతో తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు దక్కితే... వైసిపికి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయింది. అయితే జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే... తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు.  వైసిపి పార్టీ కార్యకర్తలు అలాగే నేతల పై దాడులు చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ దొరికిన విడిచి పెట్టేది లేదంటూ... వైసీపీని టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ క్యాడర్.


మాజీ మంత్రులు పేర్రి నాని, విడుదల రజిని లాంటి  వారి ఇండ్లపై దాడులు కూడా జరిగాయి. ఇటు వైసిపి పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంతమంది గుండెపోట్లు వచ్చి కూడా చనిపోయారట. అయితే... 40% పైగా  ఓట్ పర్సంటేజ్ దక్కించుకున్న వైసీపీ పార్టీని కాపాడుకునేందుకు... తాజాగా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇక ప్యాలెస్ లో ఉండటం కంటే.. జనాల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారట జగన్.


ఎన్నికల్లో గోరంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ కార్యకర్తలను అలాగే నేతలను ఉత్తేజపరిచేందుకు... జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారట. ఇటీవల పార్టీ క్యాడర్ పై జరుగుతున్న దాడులతో  బాధితులుగా మారిన వారికి అండగా నిలవడానికి.. ఆయన నిర్ణయం తీసుకున్నారట. ఇక ఓదార్పు పేరుతో... ఓ యాత్ర చేపట్టి... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. అలా చేస్తే మళ్లీ పార్టీ గాడిలో పడుతుందని... డిసైడ్ అయ్యారట జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: