•కీలక శాఖ వరిస్తుందా.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కూటమి అద్భుతమైన మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాంటి ఈ తరుణంలో టిడిపిలో సీనియర్ నేత అయినటువంటి అచ్చెన్నాయుడుకు కూడా కేబినెట్ లో చోటు లభించింది. ఈ అచ్చెన్నాయుడు ఎవరు, ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ టిడిపిలో కింజారపు కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దివంగత నేత ఎర్రన్నాయుడు టిడిపిలో కొన్నాళ్లపాటు చక్రం తిప్పిన నాయకుడు. ప్రస్తుతం ఆయన సోదరుడు అచ్చెన్నాయుడుకు కీలక నేతగా ఎదిగారు. టెక్కలి నియోజకవర్గం అచ్చెన్నాయుడు చంద్రబాబుకు ఒక్క ఫోన్ కాల్ నేతగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఈయన ఈ ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు. అలాంటి అచ్చెన్నాయుడు కేబినెట్ లో మరోసారి చోటు కల్పించారు చంద్రబాబు నాయుడు.