వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నా జగన్ నోరు విప్పలేదు. దాడులు అరికట్టాలని కొందరు నేతలను గవర్నర్ దగ్గరికి పంపించారు. అనంతరం ఒక ట్వీట్ మాత్రమే చేసి వదిలేశారు. మరో వైపు వైసీపీ నేతలను చొక్కాలు విప్పి టీడీపీ నేతలు కొడుతున్నారు. మోకాళ్లపై ఉంచి లోకేష్, చంద్రబాబు ఫొటోలకు క్షమాపణలు చెప్పిస్తున్నారు. అయినప్పటికీ జగన్ చలించలేదనే విమర్శలు వస్తున్నాయి. 2014లో సైతం వైసీపీ ఓటమి పాలై ప్రతిపక్షంగా మిగిలింది. అప్పుడు ఎన్నికల ఫలితాలు రాగానే జగన్ బయటకు వచ్చారు. ప్రతిపక్ష నేతగా తానేంటో చూపించారు. ప్రస్తుతం మాత్రం జగన్ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.