ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  కొత్త మంత్రి వర్గం కొలువు దీరింది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయగా ఆయన కింద మొత్తం 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారంతా త్వరలోనే పాలన మొదలు పెట్టనున్నారు. అలాంటి కేబినెట్లో  చంద్రబాబు నాయుడు తో పాటు మిగతా మంత్రులంతా  పెద్ద చదువులు చదివిన వారేనట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఇందులో మంత్రి పవన్ కళ్యాణ్ ఎస్ ఎస్ ఎల్ సి చేశారు అంటే ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ తో లెక్క. మంత్రి లోకేష్ ఎంబీఏ స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో చేశారు.. 

ఇక మంత్రి అచ్చెన్నాయుడు బీఎస్సీ చేశారు. నాదెండ్ల మనోహర్ ఎంబీఏ నిజాం కాలేజ్ లో , నిమ్మల రామానాయుడు  ఏంఏ ఎంఫిల్   పిహెచ్డి , నారాయణ ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు. ఆనం రామనారాయణ రెడ్డి  బీకాం బిఎల్, టీజీ భరత్  ఎంబీఏ బ్రిటన్ లో చేశారు. బీసీ జనార్దన్ రెడ్డి బిఎ, ఎన్ఎం డి, ఫరూక్ ఎస్ ఎల్ సి, కొల్లు రవీంద్ర బిఏ ఎల్ ఎల్ బి, సబితా బిఏ, సంధ్యారాణి బిఎస్సి చేశారు. కొండపల్లి శ్రీనివాస్ బీటెక్ కంప్యూటర్స్ అమెరికా లో ఎంఎస్, సత్య కుమార్ యాదవ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. పయ్యావుల కేశవ్ ఎంబీఏ, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బిడిఎస్, గొట్టిపాటి రవికుమార్  బీఈ టెక్స్టైల్స్, కొలుసు పార్థసారథి  డిగ్రీ, satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనగాని సత్యప్రసాద్ బిఎస్సి కంప్యూటర్స్ చేశారు. 

వాసంశెట్టి సుభాష్ బీఎస్సీ ఎల్ ఎల్.బి. వంగలపూడి అనిత  ఎం ఏ ఎం ఈ డి, డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎంబిబిఎస్, కందుల దుర్గేష్ ఎంఏ ఎకనామిక్స్, సంధ్యారాణి బిఎస్సి చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, ఫరూక్  ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నారు తప్పా మిగతా వారంతా డిగ్రీ ఆపైన చదివిన వారే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: