వైసీపీ పార్టీ దారుణమైన ఓటమి చవిచూసిన నేపథ్యంలో.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని షాక్‌ ఇచ్చారు ఏపీ మాజీ సీఎం జగన్‌. ఎంపీలతో వైసీపీ అధినేత జగన్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు, పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన తీరుపై చర్చ నిర్వహించిన జగన్‌.. తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామన్నారు ఈలోగా ధైర్యం కోల్పోవద్దని కోరారు వైఎస్ జగన్. అలాగే... రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని ఈ సందర్భంగా ప్రకటించారు.


లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారని వివరించారు ఏపీ మాజీ సీఎం జగన్‌. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారన్నారు. ఈ క్రమంలోనే...విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గించేశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బా రెడ్డికి అవకాశం ఇచ్చిన జగన్...  విజయసాయి రెడ్డికి ప్రాధాన్యత తగ్గించేశారని చెప్పవచ్చును. కేవలం రాజ్యసభ లో వైసిపి పక్ష నేతగా విజయసాయి రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు జగన్‌. గతంలో అన్ని బాధ్యతలు విజయసాయిరెడ్డి తీసుకునేవాడు.


కానీ ఇప్పుడు  రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారన్నారు జగన్‌. ఇక ఓటమిపై మాట్లాడుతూ...ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదని... మనలో పోరాటపటిమ తగ్గకూడదని ఆదేశించారు. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదన్నారు. 14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉందని ధైర్యం నింపే ప్రయత్నం చేశారు జగన్‌.ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిందని గుర్తు చేసిన జగన్‌...కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయని ఫైర్‌ అయ్యారు.


నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదన్నారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయన్నారు. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టం వల్ల వస్తాయని వివరించారు. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని తెలిపారు. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుందని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: