మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం కొలువుతీరిన సంగతి తెలిసిందే. మోదీ ఈసారి విజయంతో మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రిత్వ వర్గాన్ని మోదీ 3.0 కేబినెట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ కేబినెట్‌లో ఉన్న చాలామంది రకరకాల నేపథ్యాల నుంచి వచ్చారు. ఏపీ, తెలంగాణ నుంచి కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. అయితే ఈ కేబినెట్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే,

కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన కేబినెట్‌లో 99 శాతం మంది కోటీశ్వరులేనట. ఈ విషయాన్ని తాజాగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) రిపోర్ట్ వెల్లడించింది. ఆ రిపోర్ట్ ప్రకారం, కొత్తగా కేంద్ర మంత్రులుగా అయిన 71 మందిలో 70 మందికి కోట్ల రూపాయల ఆస్తి ఉంది. వీరిలో 39 శాతం మందిపై క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయట. 80 శాతం మంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ చదువుకున్నారట. 15 శాతం మంది 12వ తరగతితో చదువు ఆపేశారని రిపోర్టు వెల్లడించింది.

కేంద్ర మంత్రుల ఆస్తుల విలువ యావరేజ్‌గా రూ.107.94 కోట్లు ఉంటుందట. ఈ ఫిగర్ చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. ఇక ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ. 100 కోట్లకు పైగానే ఉంటుందట. వాళ్ల పేర్లు మాత్రం బయటికి చెప్పలేదు. ఇక లోక్‌సభలో గెలిచిన ఎంపీ అభ్యర్థుల్లో కూడా ధనవంతులే ఉన్నారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఎంపీలో 93% మంది కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. వారిలో ఎక్కువ ఆస్తి కలిగి ఉన్నవారు ఎవరో తెలుసుకుంటే..

* కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా.చంద్రశేఖర్ పెమ్మసాని ఆస్తి రూ.5,705 కోట్లు.

* ఈశాన్య ప్రాంత అభివృద్ధి, కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఆస్తి రూ.425 కోట్లు.

* భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామి ఆస్తి రూ.217 కోట్లు

* సమాచార, ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ ఆస్తి రూ.144 కోట్లు

* స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ఆస్తి రూ.121 కోట్లు

* వాణిజ్య పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఆస్తి రూ.110 కోట్లు,

* కేంద్ర హోం, సహకార శాఖా మంత్రి అమిత్ షా ఆస్తి రూ.65 కోట్లు,

* సహకార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి క్రిషన్ పాల్ ఆస్తి రూ.62 కోట్లు

* జలశక్తి శాఖ సహాయమంత్రి వి.సోమన్న ఆస్తి రూ.60 కోట్లు,

* ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఆస్తి రూ.41 కోట్లు

మరింత సమాచారం తెలుసుకోండి: