ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదిరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తన మార్కు పాలన మొదలుపెట్టాడు. అలాంటి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తనకింద 24 మంది మంత్రులకు మంత్రి పదవులు ఇచ్చి వారికి శాఖలను కూడా కేటాయించారు. ప్రస్తుతం పాలన మొదలైనట్టే తెలుస్తోంది.  ఈ విధంగా ఒక అడుగు ముందుకు వేసిన తరుణంలో కొంతమంది నేతలు విపరీతంగా కొట్లాడుతున్నారట. 

చంద్రబాబు వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారట. నాకంటే నాకు అంటూ ఆ పదవి కోసం కొట్లాడుకుంటు న్నారట. ఏం జరిగింది అసలు ఏం పదవి ఉంది అనే విషయానికి వెళ్తే..  మొత్తం 24 మంది మంత్రులను సెలెక్ట్ చేసి వారికి శాఖలను కేటాయించారు చంద్రబాబు నాయుడు.  ఇంకొక మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఆపారు.  ఆ మంత్రి పదవి కోసం దాదాపు పది మంది లీడర్ల వరకు కొట్లాడుతున్నారట.  చంద్రబాబు దగ్గరికి ఆ పదవిని తనకు కావాలంటే తనకు కావాలంటూ అడుగుతున్నారట. ఇంతకీ వారు ఎవరయ్యా అంటే బిజెపి నుంచి గెలిచిన వారిలో సృజన చౌదరి కామినేని శ్రీనివాస్ ఈ పదవిని అడుగుతున్నారు. 

అంతే కాకుండా బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రులు, ధూళిపాల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, రఘు రామ కృష్ణంరాజు, అమర్నాథ్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి అలాంటివారు ఆ ఒక్క మంత్రి పదవి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారట. మరి చూడాలి ఈ మంత్రి పదవి ఎవరిని వరించనుంది చంద్రబాబు మనసులో ఉన్నది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది.  ఈ పదవిలే కాకుండా ప్రభుత్వ విప్ మరియు అనేక కార్పొరేషన్ పదవులు కూడా ఉన్నాయి.  ఈ పదవుల కోసం కూడా చాలామంది నాయకులు ఇప్పటికే కస రత్తులు మొదలుపెట్టి నాకంటే నాకంటూ కొట్లాడు కుంటున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: