పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో పాలిటిక్స్ లో చాలా కష్టాలను అనుభవించారు. ఆయన పడిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. బహుశా ఏ సినీ నటుడు కూడా రాజకీయాల్లో పవన్ అంత కష్టపడి ఉండకపోవచ్చు. చివరికి ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ఎమ్మెల్యే కూడా కాలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్ వల్ల మెగా ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందని చాలామంది అప్పట్లో మాట్లాడారు కానీ ఇప్పుడు ఆయన వల్లే మెగా ఫ్యామిలీకి చాలా గౌరవం వచ్చింది.

ప్రమాణ స్వీకారోత్సవంలో మెగా ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూశాం. మోదీ కూడా చిరంజీవి, సురేఖ, తదితరులకు నమస్కారాలు చేస్తూ చాలా గౌరవం ఇచ్చారు. ఇదంతా కూడా పవన్ మెగా ఫ్యామిలీకి సంపాదించి పెట్టిన గౌరవం అని చెప్పవచ్చు. పవన్ గెలిచాక తన అన్నయ్య చిరంజీవితో పాటు చిరు సతీమణి సురేఖ వాణి కాళ్లపై కూడా పడి ఆశీర్వాదం తీసుకున్నారు. సురేఖ ఒక సొంత కొడుకు విజయాన్ని చూసినట్టు సంబరపడ్డారు.

చంద్రబాబు పవన్ కారణంగానే తామ విజయం సాధించగలిగామని గుర్తించారు. అందుకే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారు. డిప్యూటీ సీఎం అయ్యాక సురేఖ ఇంకా సంతోషించారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో వదినమ్మ సురేఖ పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు.  

ఈ వదినమ్మ లగ్జరీ పెన్ బ్రాండ్‌ అయిన "మౌంట్ బ్లాక్‌"కి చెందిన ఓ ఖరీదైన పెన్‌ను పవన్ కళ్యాణ్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ ఒక్క పెన్ను ఖరీదు రూ.2.5 లక్షలు ఉంటుందని సమాచారం. నిజానికి మౌంట్ బ్లాక్ పెన్నులు రూ.10 వేల ధరల్లోనూ దొరుకుతాయి. అయితే వీటిలో లక్షల ధరల ఉన్న పెన్నులు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి సురేఖ ఏ పెన్ బహూకరించారో తెలియ రాలేదు. సోషల్ మీడియా యూజర్లు మాత్రం అది రెండున్నర లక్షల రూపాయల ఖరీదైన పెన్ను అని మాట్లాడుకుంటున్నారు.

గిఫ్ట్ ఇస్తున్న సమయంలో పవన్ సురేఖల ఆనందకరమైన క్షణాలను ఓ వీడియోలో క్యాప్చర్ చేశారు. దానిని తాజాగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. మెగా కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతను చూసి చాలామంది ఫిదా అవుతున్నారు. పవన్ వదినమ్మ ఇచ్చిన గిఫ్ట్ అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: